- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
భయం భయం… సెలువులేవి?
ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా మహమ్మారి ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశించింది. ఒక కేసు నమోదైంది. కరోనా వ్యాప్తిలో భారత్ స్టేజ్ 2లో ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాలు విద్యాసంస్థలను మూసివేయించాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈనెల 30 వరకు సెలవులు ప్రకటించేసింది. ఆంధ్రప్రదేశ్ మాత్రం ధైర్యంగా పాఠశాలలు నడిపిస్తోంది. దేశంలో 120 కరోనా కేసులున్నట్టు నివేదికలు చెబుతున్నాయి.
ఈ నేపథ్యంలో జనాలు గుంపులు గుంపులుగా తిరడాన్ని నిషేధించారు. విద్యాసంస్థలు, కోచింగ్ సెంటర్లు, హాస్టళ్లు, సినిమాహాళ్లు, పబ్బులు, క్లబ్బులు, షాపింగ్ మాల్స్‌ను మూసేయాలని ఆదేశాలిస్తున్నాయి. బహిరంగ ప్రదేశాల్లో సమావేశాలను రద్దు చేసుకోవాలని సూచించాయి. ఏపీలో ఈ నిబంధనలు ఇంకా అమలులోకి రాలేదు. కానీ, కరోనాను ఎదుర్కొనేందుకు వైద్య ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టింది. ఆ శాఖ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలతో చర్చలు జరిపి, వెయ్యి పడకలు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు.
సీఎం, ఇతర మంత్రుల సమావేశంలో పాఠశాలలు, కాలేజీలకు సెలవులిస్తే బావుంటుందన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. అయితే పరీక్షల సమయంలో విద్యార్థులకు సెలువులిస్తే.. వారికి ఇబ్బందవుతుందని, రానున్నది వేసవి కాలం కావడంతో ఇప్పుడు సెలువులిచ్చి, పాఠశాలలు మళ్లీ పెడితే ఎండల తీవ్రతకు విద్యార్థులు తాళలేరని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. మేనెలలో భరించలేని ఎండలు వారిని బాధిస్తాయని, అందుకే పాఠశాలలు కొనసాగిద్దామని, స్కూళ్లు ఓపెన్ ఉంటేనే కరోనాపై సమగ్రమైన సమాచారం, సూచనలు అందజేయగలమని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. దీంతో కరోనా సెలవులు లేకుండానే స్కూళ్లను నడిపిస్తే వేసవి సెలవులు వేగంగా ఇవ్వవచ్చని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
Tags: ap schools, coronavirus, holidays for schools, education department