- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంగ్లాండ్‌లో పుట్టి ఉంటే ఎప్పుడో చనిపోయి ఉండేవాడిని: హోల్డింగ్
దిశ, స్పోర్ట్స్: వెస్టిండీస్ దిగ్గజ బౌలర్ మైఖేల్ హోల్డింగ్ జాత్యహంకార అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఒక వేళ తాను కనుక ఇంగ్లాండ్‌లో పెరిగి ఉంటే ఇప్పటి వరకు బతికి ఉండే వానిని కాదని హోల్డింగ్ అన్నారు. అమెరికాలో జార్జి ఫ్లాయిడ్ ఘటన అనంతరం ప్రపంచవ్యాప్తంగా ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. అప్పుడే పలువురు క్రికెటర్లు కూడా జాతి వివక్షపై గళం విప్పారు. మైఖేల్ హోల్డింగ్ కూడా ఈ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు. కాగా, తాజాగా మైఖేల్ హోల్డింగ్ ‘వై వీ నీల్.. హౌ వీ రైజ్’ అనే పుస్తకాన్ని రచించారు. ఈ పుస్తకం త్వరలో విడుదల అవుతున్న సందర్భంగా ఇంగ్లాండ్ మీడియాతో మాట్లాడారు.
‘నా సొంత దేశం జమైకాను వదిలి ఇతర దేశాలకు వెళ్లిన ప్రతీసారి తాను జాత్యాహంకారాన్ని ఎదుర్కున్నాను. కానీ ఇది నీ దేశం కాదు అంటూ నాకు నేను సర్ది చెప్పుకునే వాడిని. నీ దేశంలో నీకు ఇలాంటి అనుభవాలు ఎదురుకావంటూ చెప్పుకున్నాను. తాను ఇంగ్లాండ్‌లో పెరిగి ఉంటే యువకుడిగా ఉన్నప్పుడే మరణించేవాడినేమో. ఆ సమయంలో చాలా దూకుడుగా ఉండే వాడిని. ఏదో ఒక ఘటనలో ప్రాణాలు పోగొట్టుకునే వాడిని’ అని మైఖేల్ హోల్డింగ్ అన్నారు. 67 ఏళ్ల హోల్డింగ్ వెస్టిండీస్ తరపున 60 టెస్టులు, 102 వన్డేలు ఆడారు.