- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Cyber Crime: జాగ్రత్త.. ఇది సైబర్ నేరగాళ్ల పన్నాగం కావచ్చు..

దిశ, డైనమిక్ బ్యూరో : ఎవరికయినా మనం ఫోన్‌చేస్తే.. ‘ తెలియని నెంబర్లనుంచి :మీకు ఫోన్‌కాల్ (phone call) వస్తే జాగ్రత్త.. ఇది సైబర్‌నేరగాళ్ల (Cyber Crime) పన్నాగం కావచ్చు.. ’ అంటూ వాయిస్వినపడుతుంది.రోజూ ఇది వింటూనే ఉంటాం కానీ మోసపోతున్నాం. ఏపీలో సైబర్ నేరగాళ్లు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. గత ఎనిమిది నెలల్లో ఏకంగా రూ.633.13 కోట్లు కొల్లగొట్టారు. సైబర్ నేరాలను ఎదుర్కొనే కార్యాచరణపై పోలీసు శాఖ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అందజేసిన నివేదికలో ఈ వివరాలు పేర్కొంది. గత ఎనిమిది నెలల్లో1930 టోల్‌ఫ్రీ నెంబరుకు 35,111 ఫిర్యాదులు అందాయి. ఇండియన్ సైబర్ క్రైం కోఆర్డినేషన్ సెంటర్ (National Cyber Crime Reporting Portal)ఈ నెంబర్‌ను మోనిటర్చేస్తుంది. సైబర్‌నేరాల వల్ల బాధితులు సగటున రోజుకు రూ.2.66 కోట్లు కోల్పోయారన్నమాట. ఇందులో రూ.1.46 కోట్లు మాత్రమే తిరిగి రాబట్టగలిగారు. మరో రూ.61.59 కోట్లు నేరగాళ్ల పరం కాకుండా కట్టడిచేయకలిగారని వివరించారు. ఐజీ స్థాయి అధికారి నేతృత్వంలో సైబర్ నేరాల నియంత్రణ విభాగాన్ని ఏర్పాటు చేశారు. త్వరలో జిల్లాకొకటి చొప్పున 26 సైబర్ క్రైం పోలీసుస్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు వివరించింది.
దేశంలోని అన్ని రాష్ట్రాలతో పాటు ఏపీలోకూడా సైబర్‌నేరాలు పెరిగాయి. ఫోన్‌చేసి మాయమాటలు చెప్పి బ్యాంకుల పేరుతో కేవైసీ అడిగి, డెబిట్ కార్డుల అప్‌డేట్ పేరు చెప్పి మోసాలు చేస్తున్నారు. వీటిని నియంత్రించేందుకు, సైబర్ నేరగాళ్లకు చెక్ పెట్టేందుకు ఏపీ పోలీస్ శాఖ ప్రణాళిక రూపొందిస్తోంది. రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు ఒక సైబర్ పోలీసు స్టేషన్ ఏర్పాటు చేసేందుకు సైబర్ నేరాల నియంత్రణ విభాగం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఇప్పటికే విజయవాడ, విశాఖపట్నం లాంటి పెద్ద నగరాల్లో సైబర్ పోలీసు స్టేషన్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి జిల్లాలోనూ సైబర్ పోలీసు స్టేషన్ ఏర్పాటు చేసి.. బాధితుల ఫిర్యాదులను జిల్లా ఎస్పీల గ్రీవెన్స్‌లో పరిష్కరించాలని పోలీస్ శాఖ నిర్ణయించింది.