By-Elections : ఉప ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ

by M.Rajitha |
By-Elections : ఉప ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో(Telangana Assembly Sessions) బుధవారం సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రసంగించారు. రాష్ట్రంలో ఉప ఎన్నికలు(By Elections) వస్తాయని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతున్న వేళ.. సీఎం రేవంత్ రెడ్డి ఉపఎన్నికలపై క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావని తేల్చి చెప్పారు. సభ్యులు ఎవరూ ఆలోచించి ఆందోళన చెందాల్సిన పని లేదని సూచించారు. ఇలాంటి విషయాల మీద దృష్టి పెట్టకుండా.. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టడం మేలని అన్నారు. ఇతర పార్టీ నేతలు తమతో చేరినా.. చేరిన వాళ్ళు వెనక్కి వెళ్ళినా.. ఏం చేసినా ఉపఎన్నికలు రానే రావని ఖరాకండిగా స్పష్టం చేశారు.

రాష్ట్ర అభివృద్ధి మీదనే తాను ఫోకస్ పెట్టానని, ఇలాంటి విషయాల మీద ఫోకస్ పెట్టి తన సమయం వృథా చేసుకోనని అన్నారు. ఈ కేసు సుప్రీం కోర్టులో ఉన్నందున.. తీర్పు వచ్చాక ఏదైతే అది అవుతుందని, అన్నిటికీ తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. అయితే బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీలోకి మారడం.. ఆ వ్యవహారం హైకోర్ట్, సుప్రీం కోర్టు వరకు వెళ్ళడం.. రేపో మాపో సుప్రీం కోర్టులో ఆ తీర్పు వస్తుందని, పార్టీ ఫిరాయించిన వారంతా రాజీనామాలు చేసి ఉపఎన్నికలకు వెళ్తారని రాష్ట్రంలో చర్చలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో ఉప ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇవ్వడంతో నేతలు ఊపిరి పీల్చుకున్నారు.

Next Story

Most Viewed