- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Sobhita Dhulipala: అక్కినేని కోడలకి ఘోర అవమానం.. మా బ్రాండ్‌కు నువ్వు సెట్ కావంటూ శోభితను తీసేసి కుక్కతో షూట్

దిశ, సినిమా: అక్కినేని కోడలు, స్టార్ హీరోయిన్ శోభిత ధూళిపాళ (Sobhita Dhulipala) తెలుగు అమ్మాయే అయినప్పటికీ బాలీవుడ్(Bollywood)లో బాగా ఫేమ్ తెచ్చుకుంది. అక్కడ వరుస సినిమాలు చేస్తూ స్టార్ డమ్ అందుకుంది. ‘గూఢచారి’ సినిమాతో తెలుగు పరిచయమైన ఈ బ్యూటీ.. మేజర్ (Major), పొన్నియన్ సెల్వన్ (Ponniyan Selvan) వంటి మూవీస్‌తో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఇక గతేడాది అక్కినేని హీరో నాగ చైతన్యను పెళ్లి చేసుకుని టాలీవుడ్‌లో ప్రజెంట్ అక్కినేని కోడలుగా రాణిస్తుంది. ఇదిలా ఉంటే.. శోభితకు కూడా సక్సెస్ అంత ఈజీగా రాలేదని అర్థం అవుతోంది. తెలుగులో కంటే బాలీవుడ్‌లోనే ఎక్కువ క్రేజ్ తెచ్చుకున్న ఈ అమ్మడు.. తన సినీ కెరీర్ స్టార్టింగ్‌లో ఎదుర్కొన్న ఓ చేదు అనుభవం గురించి చెప్పుకొచ్చింది.
ఇటీవల్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శోభిత మాట్లాడుతూ.. ‘ఒక బ్రాండ్ వాళ్లు నాకు రాత్రి 11:30 గంటల సమయంలో కాల్ చేసి ఆడిషన్‌కు పిలిచారు. ఆ టైంలో కాల్ వచ్చినందుకు కాస్త విచిత్రంగా అనిపించిన.. సరే అని వెళ్లాను. ఆడిషన్ పూర్తి అయ్యాక నన్ను సెలక్ట్ చేశారు. అయితే యాడ్ షూటింగ్ కోసం గోవాకు వెళ్లాల్సి ఉంటుంది అని చెప్పారు. అదేదో థాయ్‌లాండ్, ఆస్ట్రేలియా కాకపోయిన ఆ టైమ్‌లో గోవా అంటే చాలా ఎగ్జైటింగ్‌గా ఫీల్ అయ్యాను. గోవా వెళ్లాక మొదటి రోజు షూటింగ్ జరిగింది. తర్వాత కెమెరాలో ఏదో ప్రాబ్లెబ్ ఉందని చెప్పి మిగిలింది తర్వాత షూట్ చేద్దాం అని చెప్పారు. తర్వాత రోజు నేను వెళితే.. ఈ అమ్మాడు మన బ్రాండ్ ఇమేజ్‌కు సరిపోదు అని అన్నారు. నేను కాన్ఫిడెంట్‌గా కనిపిస్తున్నానని వద్దు అన్నారు. అంత కాన్ఫిడెంట్‌గా కనిపించే అమ్మాయి ఈ బ్రాండ్‌కు సెట్ అవ్వదు అని చెప్పి.. నా ప్లేస్‌లో ఓ శునకాన్ని పెట్టి తీసుకున్నారు. అయితే.. ఒకరోజు పని చేసినందుకు నాకు డబ్బులు ఇచ్చారు’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.