Tirumala News:టీటీడీ ట్రస్ట్‌కు భారీ విరాళాలు.. 9 రోజుల్లో వచ్చిన మొత్తం తెలిస్తే షాక్?

by Jakkula Mamatha |   ( Updated:2025-03-26 11:22:32.0  )
Tirumala News:టీటీడీ ట్రస్ట్‌కు భారీ విరాళాలు.. 9 రోజుల్లో వచ్చిన మొత్తం తెలిస్తే షాక్?
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ(Andhra Pradesh)లోని తిరుమల(Tirumala) శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని ప్రపంచ నలుమూలల నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) దర్శించుకుంటారు. ఈ క్రమంలో భక్తి శ్రద్ధలతో కాలినడకన తిరుమల చేరుకుని మొక్కులు చెల్లించుకుంటారు. అంతే కాదు పలువురు శ్రీవారి భక్తులు టీటీడీ ట్రస్ట్‌(TTD Trust)లకు విరాళాలు కూడా అందజేస్తారు. ఈ తరుణంలో టీడీకి చెందిన ఎస్వీ అన్నదానం, ఎస్వీ ప్రాణదానం, ఎస్వీ విద్యాదానం విభాగాలకు భక్తులు భారీ విరాళాలు అందజేయడం జరుగుతుంది.

ఈ క్రమంలో ఇటీవల తిరుమలలోని టీటీడీ ట్రస్ట్‌లకు విరాళాలు(Donations) భారీగా పెరిగాయి. గడిచిన తొమ్మిది రోజుల్లో టీటీడీ ట్రస్ట్‌లకు రూ.26.85కోట్లు విరాళంగా అందాయి. అత్యధికంగా శ్రీవారి ఆలయ నిర్మాణ ట్రస్ట్‌కు రూ.11.67కోట్లు, ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్‌కు రూ.6.14 కోట్లు, శ్రీబాలాజీ ఆరోగ్య వరప్రసాదిని స్కీమ్‌కు రూ.4.88 కోట్లు అందాయి. తాజాగా రాజమహేంద్రవరానికి చెందిన తిరుమల విద్యాసంస్థల చైర్మన్ తిరుమలరావు దంపతులు టీటీడీ విద్యాదాన ట్రస్ట్‌కు రూ.1.01 కోట్లు విరాళం ఇచ్చారు.

Next Story