మద్యం మత్తులో యువకుడు ఘాతుకం

by Sridhar Babu |
మద్యం మత్తులో యువకుడు ఘాతుకం
X

దిశ, మంగపేట : మద్యానికి బానిసైన యువకుడు జీవితంపై విరక్తి చెంది ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన మండలంలోని నిమ్మగూడెంలో బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. నిమ్మగూడెం గ్రామానికి చెందిన మద్దెల చందర్ రావు (34) అనే యువకుడు నిత్యం మద్యం తాగుతూ గ్రామంలో జులాయిగా తిరిగే వాడు. కొన్ని రోజులు మద్యం మానేసి కూలి పనులు చేసుకున్న చందర్ రావు మళ్లీ మద్యం తాగడం ప్రారంభించాడు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులతో గ్రామంలో గొడవలకు దిగుతూ జీవితంపై విరక్తి చెంది మద్యం మత్తులో గ్రామం చివరలో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్యహత్యకు పాల్పడ్డాడు. భార్య మద్దెల గాయత్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story