EAPCET-2025.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్!

by Jakkula Mamatha |
EAPCET-2025.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్!
X

దిశ,వెబ్‌డెస్క్: తెలంగాణ(Telangana)లో EAPCET-2025 దరఖాస్తు గడువు రేపటితో(ఏప్రిల్ 4) ముగియనుంది. అర్హత గల అభ్యర్థులకు ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. దరఖాస్తు ఫీజు ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.500, ఇతరులు రూ.900 చెల్లించాల్సి ఉంటుంది. అగ్రికల్చర్, ఇంజినీరింగ్ రెండు స్ట్రీమ్‌లకు దరఖాస్తు ఫీజు రూ.1000, ఇతరులకు రూ.1800 చెల్లించాల్సి ఉంటుంది. వచ్చే నెల(మే) 2 నుంచి 5 వరకు ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష, ఈ నెల(ఏప్రిల్) 29, 30 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మా పరీక్షలు నిర్వహించనున్నారు. మొదటి సెషన్ పరీక్ష ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహిస్తారు. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://eapcet.tgche.ac.in/ సందర్శించండి.


👉 Read Disha Special stories


Next Story