- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
క్వారెంటైన్ వాళ్లపై కన్నేసే ‘‘కరోనా ముక్త్ యాప్ ’’
దిశ వెబ్ డెస్క్ : కరోనా వైరస్ విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో… హోం క్వారెంటైన్‌లో ఉన్న వారిని గుర్తించడంతోపాటు, ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించడానికి హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఒక యాప్‌ను తీసుకొచ్చింది. హిమాచల్‌ప్రదేశ్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్‌ఫర్‌మేషన్ టెక్నాలజీ రూపొందించిన ఈ యాప్ కు ‘‘కరోనా ముక్త్ హిమాచల్’’ అని పేరు పెట్టింది. ఆరోగ్య శాఖలో పనిచేసే హెల్త్ వర్కర్లు ఈ యాప్ ఉపయోగిస్తూ ప్రజల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోనున్నారు. ముఖ్యంగా హోం క్వారెంటైన్‌లో ఉన్నవారి హెల్త్ కండిషన్‌ను పర్యవేక్షించనున్నారు.
గ్రామాల్లోని హెల్త్ వర్కర్లు ఇచ్చే ఓటీపీ సాయంతో ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని హిమాచల్ ప్రదేశ్ సమాచార సాంకేతిక శాఖ వెల్లడించింది. ఓటీపీ బేస్‌డ్ అప్లికేషన్ సాయంతో పనిచేసే ఈ మొబైల్ యాప్ ద్వారా హోంక్వారంటైన్ లో ఉన్న వారు నిబంధనలను ఉల్లంఘిస్తే ఆరోగ్యకార్యకర్తలు సులభంగా గుర్తిస్తారని హిమాచల్‌ప్రదేశ్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్‌ఫర్‌మేషన్ టెక్నాలజీ డైరెక్టర్ రోహాన్ చాంద్ ఠాకూర్ చెప్పారు. కాగా, హిమాచల్‌ప్రదేశ్‌లో ఇప్పటివరకు 1779 మంది హోమ్ క్వారెంటైన్‌లో ఉన్నారు. ఇప్పటి వరకు ఒక వ్యక్తి కరోనా సోకి మరణించాడు. మొత్తం 211 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 208 మందికి నెగెటివ్‌గా తేలింది. మరో మూడు పాజిటివ్ కేసులు ఉన్నాయి.
Tags : corona virus, app, himachalpradesh, corona mukth app, health workers, homw quarantine