- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫిజికల్‌గానే తేలుద్దాం.. చెన్నమనేని రమేష్ పిటిషన్‌పై హైకోర్టు క్లారిటీ
దిశ, తెలంగాణ బ్యూరో: వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వ వివాదంపై ఫిజికల్ కోర్టులోనే విచారణ చేపట్టనున్నట్లు హైకోర్టు స్పష్టం చేసింది. భౌతికంగా వాదనలను వినిపించడానికి సిద్ధంగా ఉండాలని అన్ని పక్షాల తరపు న్యాయవాదులకు క్లారిటీ ఇచ్చింది. ఈ కేసుకు సంబంధించిన అఫిడవిట్‌లు, మెమోలు, చట్టాలు అన్నీ సిద్ధంగా ఉన్నందున ముగింపుకు తేవడానికి కోర్టు సిద్ధంగా ఉందని, వాదనలు వినిపించడానికి కూడా న్యాయవాదులు సిద్ధంగా ఉండాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను అక్టోబరు 21కు వాయిదా వేసింది.
చెన్నమనేని రమేష్ తరపు న్యాయవాది వై.రామారావు వాదనలు వినిపిస్తూ.. ఫిజికల్ కోర్టు హియరింగ్ జరగాలని కోరుకుంటున్నట్లు కోర్టుకు తెలిపారు. దీనిపై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాలను కూడా తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన బెంచ్.. రాష్ట్ర ప్రభుత్వం తరపున హాజరైన అడ్వకేట్ జనరల్, కేంద్ర ప్రభుత్వం తరపున హాజరైన అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ అభిప్రాయాలను సేకరించింది. వీరిద్దరూ భౌతిక విచారణకు మద్దతు పలికి సిద్ధమేనని అంగీకారం తెలిపారు.
ఈ అభిప్రాయానికి అభ్యంతరం వ్యక్తం చేసిన పిటిషనర్ ఆది శ్రీనివాస్ తరపు న్యాయవాది రవికిరణ్.. ఇప్పటికే కేసు విచారణలో జాప్యం జరుగుతున్నదని, వీలైనంత తొందరగా వాదనలను పూర్తి చేసి తీర్పును వెలువరించాలని కోరారు. అన్ని వైపుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న బెంచ్.. తదుపరి విచారణను భౌతికంగా అక్టోబరు 21వ తేదీన విచారించనున్నట్లు క్లారిటీ ఇచ్చి వాయిదా వేసింది.