ఆ కేంద్రాలకు వైసీపీ రంగులు.. సీఎం జగన్‌కు షాకిచ్చిన హైకోర్టు..!

by srinivas |
ఆ కేంద్రాలకు వైసీపీ రంగులు.. సీఎం జగన్‌కు షాకిచ్చిన హైకోర్టు..!
X

దిశ, ఏపీబ్యూరో : ఏపీ హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కెదురైంది. చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రంగులు వేయడంపై హైకోర్టు ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. గతంలో రంగులు వేయొద్దని ధర్మాసనం సూచించినా, మళ్లీ కలర్స్ వేయడంపై మండిపడింది. చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలకు వైసీపీ కలర్స్ వేయడంపై జై భీమ్ యాక్సిస్ జస్టిస్ కృష్ణా జిల్లా అధ్యక్షులు పరసా సురేష్ కుమార్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. పిటిషన్‌పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది.

పిటిషనర్ తరపు న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు. ప్రభుత్వ వ్యయంతో ఏర్పాటు చేసే భవనాలకు పార్టీ రంగులు వేయడంపై న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. న్యాయవాది శ్రవణ్ కుమార్ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం ప్రిన్సిపల్ సెక్రటరీ పంచాయతీరాజ్ డిపార్ట్‌మెంట్‌, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్‌ మేనేజింగ్ డైరెక్టర్‌ను ఈ నెల 16న కోర్టులో వ్యక్తిగతంగా హాజరుకావాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ సందర్భంగా ప్రతివాదులందరికీ ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.

Advertisement

Next Story