- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హైకోర్టు కీలక ఆదేశాలు.. మళ్లీ లాక్‌డౌన్ తప్పదా..?
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి, కొత్తగా నమోదవుతున్న పాజిటివ్ కేసులపై ఆందోళన వ్యక్తంచేసిన హైకోర్టు జనం గుమికూడకుండా ప్రభుత్వం ఆంక్షలు విధించాలని ఆదేశించింది. అంత్యక్రియలు, పెళ్లిళ్లు, ఇతర కార్యక్రమాలకు వందలాది మంది హాజరవుతున్నందున వైరస్ వ్యాప్తికి కారణమవుతాయని, దీన్ని దృష్టిలో పెట్టుకుని వంద మంది కంటే ఎక్కువ సంఖ్యలో గుమికూడకుండా ప్రభుత్వమే చూసుకోవాలని స్పష్టం చేసింది. కరోనా టెస్టులపై గురువారం హైకోర్టులో జరిగిన విచారణ సందర్భంగా రాపిడ్ టెస్టులు, ఆర్‌టీపీసీఆర్ టెస్టుల సంఖ్య, వాటి ద్వారా పాజిటివ్‌గా నిర్ధారణ అయినవి బులెటిన్లలో వేర్వేరుగా పేర్కొనాలని, ప్రతీరోజు క్రమం తప్పకుండా టెస్టులు చేయాలని, గతంలో సూచించినట్లుగా రోజూ యాభై వేల పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వానికి స్పష్టంచేసింది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై అడ్వొకేట్ జనరల్ నివేదిక సమర్పించారు. దీన్ని పరిశీలించిన హైకోర్టు ఈ నెల 7, 11 తేదీల్లో 20వేల లోపు టెస్టులు మాత్రమే చేసినట్లు ఉందని, కారణమేమిటని ప్రశ్నించింది. పొరుగు రాష్ట్రాల్లో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్నందున రాష్ట్ర సరిహద్దులు, రైల్వే, బస్ స్టేషన్‌లో 300 మొబైల్ బస్సులతో టెస్టులు చేస్తున్నట్లు హైకోర్టుకు అడ్వొకేట్ జనరల్ వివరించారు. హైకోర్టు ఆదేశాల మేరకు డైలీ బులెటిన్ ఇస్తున్నామని తెలిపారు. జోక్యం చేసుకున్న హైకోర్టు అదనపు వివరాలతో నివేదిక సమర్పించాలని సూచించి తదుపరి విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది.