ఏపీ ఎన్నికల సంఘానికి హైకోర్టు నోటీసులు

by Anukaran |
ఏపీ ఎన్నికల సంఘానికి హైకోర్టు నోటీసులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ఎన్నికల సంఘానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పంచాయతీ ఎన్నికల నిర్వహణ పిటిషన్‌‌పై హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. కరోనా కారణంగా ఎన్నికలు సాధ్యం కాదని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. దీంతో ఆగ్రహించిన హైకోర్టు అదే మాట రాష్ట్ర ఎన్నికల సంఘానికి చెప్పాలని సూచించింది. దేశంలోని అనేక రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తుంటే… ఏపీలో పంచాయతీ ఎన్నికలు ఎందుకు సాధ్యం కాదని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఈ విషయంపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అనంతరం ఈ విచారణను నవంబర్ 2కు వాయిదా వేస్తూ, కోర్టు నిర్ణయం తీసుకుంది.

Advertisement

Next Story

Most Viewed