- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జియో మొబైల్ టవర్ల ధ్వంసంపై కేంద్రానికి కోర్టు నోటీసులు!
దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్, హర్యానా ప్రాంతాల్లో జియోకు చెందిన మొబైల్ టవర్ల ధ్వంసంపై రిలయన్స్ జియో కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. కంపెనీ మొబైల్ టవర్లను స్వార్థ ప్రయోజనాలతో ధ్వంసం చేస్తున్న వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని రిలయన్స్ జియో హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు దీనిపై సమాధానం ఇవ్వాలని పంజాబ్ ప్రభుత్వంతో పాటు, కేంద్రానికి అదేశాలు జారీ చేసింది. అనంతరం ఈ కేసు విషయమై విచారణను ఈ నెల 8కి వాయిదా వేసింది.
గత కొంతకాలంగా కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలపై పలు ప్రాంతాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. అయితే, రైతుల ఆందోళనల నేపథ్యంలో వ్యాపార శత్రువులు ఉద్దేశ్యపూర్వకంగానే జియో మొబైల్ టవర్లను లక్ష్యంగా చేసుకుని ఆస్తి నష్టం కలిగిస్తున్నారని కంపెనీ తెలిపింది. ఇది ప్రత్యర్థుల పనే అని భావిస్తున్నట్టు జియో ఇటీవల ఆరోపణలు జారీ చేసింది. ఇలాంటి విధ్వంసకర దాడుల వల్ల కంపెనీ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారని, తమ ఆస్తులను కాపాడేందుకు సరైన ఆదేశాలివ్వాలని జియో కోరింది. కాగా, జియో ఆరోపణలను టెలికాం ప్రత్యర్థులుగా ఉన్న ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా ఖండించిన విషయం తెలిసిందే.