డబుల్ బెడ్ రూం ఇళ్లపై సర్కారుకు హైకోర్టు నోటీసు

by Shyam |
double bedroom houses
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం కట్టిన డబుల్ బెడ్‌‌రూమ్ ఇళ్ల అప్పగింతకు సంబంధించి నాలుగు వారాల్లో నివేదిక అందజేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇళ్ల నిర్మాణం పూర్తయినా లబ్ధిదారులకు అందజేయడంలో జరుగుతున్న జాప్యానికి కారణాలను వివరించాలని స్పష్టం చేసింది. బీజేపీ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను బుధవారం విచారించిన హైకోర్టు పై ఆదేశాలు జారీ చేసింది. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తయినా లబ్ధిదారులకు అందించడం లేదని, ఫలితంగా ఆ ఇళ్లు నిరుపయోగంగా ఉన్నాయని పిటిషనర్ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. నిర్మాణాలు పూర్తయినప్పటికీ అందించకపోవడం కారణంగా కోట్లాది రూపాయల ప్రజా ధనం వృథా అయిందని, ఇళ్ల నిర్మాణాలు కూడా దెబ్బతింటున్నాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ పిటిషన్‌లోని విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు నాలుగు వారాల్లో నివేదిక ఇవ్వాల్సిందిగా ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

Advertisement

Next Story

Most Viewed