- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్థానిక ఎన్నికలను నిలిపివేయలేం.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు
దిశ, తెలంగాణ బ్యూరో : ప్రస్తుతం రాష్ట్రంలో జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలను నిలిపివేయలేమని, దానిపై నిర్ణయం తీసుకోవాల్సింది రాష్ట్ర ఎన్నికల సంఘమేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఎన్నికల నిర్వహణపై తుది నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్ర ఎన్నికల సంఘానిదేనని స్పష్టం చేసింది. తదుపరి విచారణను జూన్ 7వ తేదీకి వాయిదా వేసింది. అయితే పిటిషనర్ లేవనెత్తిన అంశాలను పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది.
ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రెండు మున్సిపల్ కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీలకు జరిగే ఎన్నికలు, మరికొన్ని గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల్లోని ఖాళీలకు నిర్వహించే ఉప ఎన్నికలను వాయిదా వేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీకి చెందిన షబ్బీర్ ఆలీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం విచారణ జరిపిన బెంచ్‌పై నిర్ణయం తీసుకుంది.
కరోనా వైరస్ వ్యాప్తి వేగంగా పెరుగుతున్నందున ఈ ఎన్నికలను వాయిదా వేయాలని పిటిషన్‌లో షబ్బీర్ ఆలీ కోరారు. కానీ ఎన్నికలను వాయిదా వేయడానికి నిరాకరించిన హైకోర్టు ఆ నిర్ణయం తీసుకోవాల్సింది రాష్ట్ర ఎన్నికల సంఘమేనంటూ పేర్కొని పరిశీలించాల్సిందిగా నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ జూన్ 7న జరగనుంది.