అలాంటప్పుడు అవెందుకు..? : హైకోర్టు

by Shyam |
అలాంటప్పుడు అవెందుకు..? : హైకోర్టు
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలోని పాఠశాలల్లో ఆన్ లైన్ తరగతుల నిర్వహణపై దాఖలైన పిటిషన్ పై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆన్ లైన్ క్లాసులపై నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించిందని సమాచారం. దీంతో ఇంకా విద్యా సంవత్సరం ప్రారంభించలేదని, ఈ విషయంలో కేబినెట్ సబ్ కమిటీ తుది నిర్ణయం తీసుకుంటదని ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్.. కోర్టుకు తెలిపారని, నిర్ణయం తీసుకోనప్పుడు తరగతులు ఎందుకు నిర్వహిస్తున్నారని, పేద విద్యార్థులకు ఎలాంటి న్యాయం జరుగుతుందని ధర్మాసనం ప్రభుత్వాన్ని ప్రశ్నించినట్లు తెలిసింది. ఈనెల 13న నిర్ధిష్ట ప్రణాళిక సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈనెల 13కు వాయిదా వేసినట్లు సమాచారం.

Advertisement

Next Story