- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తీన్మార్ మల్లన్నకు హైకోర్టులో ఊరట.. పోలీస్ శాఖకు కీలక ఆదేశాలు
దిశ, డైనమిక్ బ్యూరో: క్యూ న్యూస్ అధినేత తీన్మార్ మల్లన్న(చింతపండు నవీన్ కుమార్)కు హైకోర్టులో ఊరట లభించింది. మల్లన్న భార్య మాతమ్మ వేసిన పిటిషన్‌పై సోమవారం న్యాయస్థానం విచారణ జరిపింది. ఒకే కారణంతో మల్లన్నపై పలు కేసులు నమోదు చేయడంపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇకపై తెలంగాణలో మల్లన్నను అరెస్ట్ చేయాలన్నా, మరో కేసు నమోదు చేయాలన్నా డీజీపీ అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేసింది. అంతేగాకుండా.. డీజీపీ పర్యవేక్షణలోనే విచారణ జరగాలని హైకోర్టు ఆదేశించింది. మల్లన్నపై ఉన్న 35 కేసులపై న్యాయవాది దిలీప్ సుంకర వాదనలు వినిపించారు. బెయిల్ పిటిషన్‌పై రేపు మరోసారి హైకోర్టులో మల్లన్న తరుపు న్యాయవాది వాదనలు వినిపించనున్నారు. తీన్మార్ మల్లన్న బీజేపీలోకి చేరనున్న విషయం తెలిసిందే. అయితే, బెయిల్ రాగానే బీజేపీ పార్టీ పెద్దల సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది.