- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హైకోర్టులో నీలం సాహ్నికి ఊరట
దిశ, ఏపీ బ్యూరో : ఏపీ ఎస్ఈసీ నీలం సాహ్నికి హైకోర్టులో ఊరట లభించింది. ఎస్ఈసీగా నీలం సాహ్ని నియామకం చెల్లదంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను గురువారం హైకోర్టు కొట్టివేసింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన నీలం సాహ్నిని ప్రభుత్వం ఎస్ఈసీగా నియమించింది. సీఎస్‌గా పనిచేసిన నీలం సాహ్నిని ఎస్ఈసీగా నియమించడం నిబంధనలకు విరుద్ధమంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. సీఎస్‌గా పనిచేసి పదవీ విరమణ పొందిన వెంటనే ఎస్ఈసీగా నియమితులవ్వడం అంటే రాజకీయ పార్టీ ప్రభావం ఉంటుందని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టులో వాదించారు.
సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం నీలం సాహ్ని నియామకం చెల్లదని వాదించారు. ఎస్ఈసీగా నీలం సాహ్ని నియామకాన్ని రద్దు చేయాలని, తిరిగి వారి స్థానంలో కొత్తవారిని నియమించేలా ఆదేశాలివ్వాలంటూ పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలతో హైకోర్టు విభేదించింది. ఎస్ఈసీగా నీలం సాహ్ని నియామకం సరైనదేనని అభిప్రాయపడింది. ఎక్కడా నిబంధనల ఉల్లంఘన అనేది జరగలేదని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా ఎస్ఈసీగా నీలం సాహ్ని నియామకం చెల్లదంటూ దాఖలైన పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది.