- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పంచ్ ప్రభాకర్‌ను ఎందుకు అరెస్ట్ చేయలేదు ?
దిశ, ఏపీ బ్యూరో: జడ్జిలపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో సీబీఐపై మరోసారి ఏపీ హైకోర్టు మండిపడింది. న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలపై హైకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. హైకోర్టు విచారణకు విశాఖ సీబీఐ ఎస్పీ హాజరయ్యారు. కేసు విచారణ ఎంతవరకు వచ్చిందని ధర్మాసనం ఎస్పీని ప్రశ్నించింది. అయితే పంచ్ ప్రభాకర్ వీడియోలపై యూట్యూబ్‍కు లేఖ రాసినట్లు సీబీఐ ఎస్పీ తెలిపారు. అయితే తమకు ఎలాంటి లేఖ అందలేదని యూట్యూబ్, ఫేస్‍బుక్, వాట్సప్ తరపున హాజరైన న్యాయవాదులు ముకుల్ రోహత్గి, కపిల్ సిబాల్ వెల్లడించారు. దీంతో సీబీఐ తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
ప్రభాకర్‌ను ఎందుకు అరెస్ట్ చేయలేదు?
పంచ్ ప్రభాకర్‌ను అరెస్ట్ చేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పంచ్ ప్రభాకర్ అనే వ్యక్తి విదేశాల్లో ఉంటూ ప్రతి రోజూ పోస్టులు, వీడియోలు పెడుతుంటే ఎందుకు అరెస్ట్ చేయడం లేదో చెప్పాలని సీబీఐని హైకోర్టు ప్రశ్నించింది. సీబీఐ దర్యాప్తు చేపట్టి నెలలు గడుస్తున్నా పోస్టులు ఎందుకు ఆగడం లేదో చెప్పాలని హైకోర్టు ప్రశ్నించింది. విదేశాల్లో ఉన్న అతడ్ని అరెస్ట్ చేసేందుకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించింది. ప్రభాకర్‌ను సీబీఐ అరెస్ట్ చేయాలని చెప్తున్నా.. ఇప్పటికీ అరెస్ట్ చేయకపోవడంపై అసహనం వ్యక్తం చేసింది. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినవారిపై చర్యలు తీసుకోవడంలో సీబీఐ విఫలమైందని పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. పంచ్ ప్రభాకర్ అందుకే యూట్యూబ్ ఛానల్ ద్వారా మళ్లీ జడ్జిలను కించపరుస్తూ వీడియోలు పెడుతున్నారని ఆరోపించారు. ఆ వీడియోలను తొలగించేలా ఆ సంస్థలను ఆదేశించాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. పంచ్ ప్రభాకర్ వీడియోలు పోస్ట్ చేస్తే అవి తొలగించేలా చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు. అయితే పోస్టులు పెట్టకుండా కట్టడి చేయలేమని వాట్సాప్, ఫేస్‌బుక్, గూగుల్, యూట్యూబ్ తరపు న్యాయవాదులు ముకుల్ రోహత్గి, కపిల్ సిబాల్ వాదనలు వినిపించారు. కోర్టు, దర్యాప్తు సంస్థ యూఆర్‌ఎల్ ఇచ్చి.. ఆ వీడియోలను తొలగించాలని కోరితే తీసేస్తామని కోర్టుకు హామీ ఇచ్చారు.
ఈ కేసులో ఇప్పటి వరకు 11 మందిని అరెస్ట్ చేశామని.. ఐదుగురు బెయిల్‌పై విడుదల అయ్యారని సీబీఐ తరపు న్యాయవాది సుభాష్ తెలిపారు. అభ్యంతరకర పోస్టులు తొలగించేందుకు కేంద్రంతో సంప్రదిస్తున్నామని.. విదేశాల్లో ఉన్న పంచ్ ప్రభాకర్‌కు నోటీసులు జారీ చేశామని, ఇంటర్‌పోల్‌కు సైతం లేఖ రాసినట్లు న్యాయవాది సుభాష్ తెలిపారు. మరోవైపు రిజిస్ట్రార్ జనరల్ నుంచి అభ్యంతరకర పోస్టులపై విజ్ఞప్తి వస్తే వెంటనే ఆ పోస్టులు, వీడియోలు తొలగించాలని స్టాండింగ్ కౌన్సిల్ కోరింది. పంచ్ ప్రభాకర్‍ను ఎవరో నాయకులు నడిపిస్తున్నారని హైకోర్టు స్టాండింగ్ కౌన్సిల్ సందేహం వ్యక్తం చేసింది. పంచ్ ప్రభాకర్ విషయమై సీబీఐ డైరెక్టర్‍ను అఫిడవిట్ దాఖలు చేయాల్సిందిగా ఆదేశించాలని స్టాండింగ్ కౌన్సిల్ కోరింది. పంచ్ ప్రభాకర్‍పై ఎలాంటి చర్యలు తీసుకున్నారో వెంటనే అఫిడవిట్ దాఖలు చేయాలని సీబీఐని హైకోర్టు ఆదేశించింది. సీబీఐ జాయింట్ డైరెక్టర్ అఫిడవిట్ వేస్తారని సీబీఐ న్యాయవాది సుభాష్ తెలియజేశారు.