భావోద్వేగానికి లోనైన హైకోర్టు చీఫ్ జస్టిస్

by srinivas |   ( Updated:2021-01-04 06:12:25.0  )
భావోద్వేగానికి లోనైన హైకోర్టు చీఫ్ జస్టిస్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి వీడ్కోలు సమావేశంలో భావోద్వేగానికి గురయ్యారు. సామాన్య కుటుంబంలో పుట్టిన నేను కష్టపడి ఈ స్థాయికి వచ్చానని, ఇక్కడి నుంచి వెళ్లిపోతున్నందుకు చాలాబాధగా ఉందని జస్టిస్ జేకే మహేశ్వరి అన్నారు. వ్యక్తులు వస్తుంటారు, పోతుంటారు.. వ్యవస్థల ఔన్నత్యాన్ని కాపాడాలని , సహచర జడ్జిలు, సిబ్బంది అభిమానాన్ని మరచిపోలేనని వ్యాఖ్యానించారు. ఒక్కోసారి రాత్రి 10గంటల వరకు పనిచేయాల్సి వచ్చిందన్నారు. చీఫ్ జస్టిస్‌కు వీడ్కోలు పలకడానికి రోడ్డుకు ఇరువైపులా మహిళా రైతులు జాతీయ జెండాలు పట్టుకొని నిల్చున్నారు.

Advertisement

Next Story