- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రామతీర్థం జంక్షన్‌లో ఉద్రిక్తత
దిశ, వెబ్ డెస్క్: విజయనగరం జిల్లా రామతీర్థం జంక్షన్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కోదండరాముడి విగ్రహాల ధ్వంసం ఘటనకు నిరసనగా.. నేడు బీజేపీ, జనసేన పార్టీలు రామతీర్థం ధర్మయాత్రకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.. దీంతో ఎక్కడికక్కడ బీజేపీ, జనసేన శ్రేణులను పోలీసులు అడ్డుకుంటున్నారు.
ఈ క్రమంలో నెల్లిమర్ల వద్ద బీజేపీ నేత సోము వీర్రాజుతో పాటు పార్టీ నేతలను ముందస్తుగా అరెస్ట్ చేశారు. మరోవైపు బీజేపీ ఎమ్మెల్స మాధవ్‌ను అరెస్ట్ చేశారు. దీంతో పోలీసులు, బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. బీజేపీ, జనసేన నేతలు రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపారు. బీజేపీ కార్యలయం నుంచి సీఎం రమేశ్, కామినేని శ్రీనివాసరావు, ఆదినారాయణ రెడ్డి రామతీర్థం ప్రాంతానికి బయలుదేరగా పోలీసులు అడ్డుకున్నారు.
ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ.. విజయసాయిరెడ్డి, చంద్రబాబు, మంత్రులకు అనుమతించారు.. తమను ఎందుకు అడ్డుకుంటారని ప్రశ్నించారు.రామతీర్థం వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడాన్ని ఖండించారు.
ఇప్పటికే గుంటూరులోని ఆయన నివాసంలో కన్నా లక్ష్మీనారాయణ, ఉమామహేశ్వరరావును గృహనిర్భంధం చేశారు. మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజును గృహనిర్బంధం చేశారు. రామతీర్థం పరిసరాల్లో భారీగా పోలీసులు మోహరించారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా బందోబస్తును ఏర్పాటు చేశారు. రామతీర్థంలో సెక్షన్ 30, పోలీస్ యాక్ట్ 1861 అమలులో ఉంది.