ప్రేమను కౌగిలింతతో చుట్టేస్తే..

by Shyam |
ప్రేమను కౌగిలింతతో చుట్టేస్తే..
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రేమను కౌగిలింతతో చుట్టేస్తే అంటూ అటవీ శాఖ అధికారి సుశాంత్ నంద ప్రేమతో ట్వీట్ చేశారు. ఎవరైనా సరే తమ ప్రేమను తెలియజేయడానికి, తనలో ఉన్న బాధను కౌగిలంత ద్వారా వ్యక్త పరుస్తారు. అయితే అలానే ఓ వ్యక్తి తనలో ఉన్న ఇష్టాన్ని కౌగిలింత ద్వారా తెలియజేశారు. ఇతకు తన కౌగిలింత ఎవరిని అనుకుంటున్నారా.. సముద్రంలోని స్కూబా డైవింగ్ కు వెళ్లిన వ్యక్తిని ఓ సీల్ ప్రేమగా దగ్గరికి తీసుకుంది. సీల్ ప్రేమకు దాసుడైన వ్యక్తి సీల్ ను మనిషిలానే దగ్గరికి తీసుకొని వీపుమీది చేయివేసి అప్యాయంగా నిమిరాడు. అయితే ఈ వీడియోను అటవీశాఖ అధికారి ప్రేమను కౌగిలింత చుట్టేస్తే అంటూ క్యాప్షన్ పెట్టి షేర్ చేశారు. ఈ వీడియోకు నెటిజన్లు మనుషులే కాదు జంతువులు కూడా కౌగిలింత ద్వారా తమ ప్రేమను వ్యక్తపరుస్తాయని కామెంట్ చేస్తున్నారు. దీంతో ఈ వీడియో కాస్త నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.

Advertisement

Next Story

Most Viewed