నితిన్ ని సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న హీరోయిన్ ప్రణీత .. ఫోటోలు వైరల్

by Anukaran |   ( Updated:2021-05-31 03:25:09.0  )
నితిన్ ని సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న హీరోయిన్ ప్రణీత .. ఫోటోలు వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ లో పలువురు సెలబ్రెటీస్ ఈ లాక్ డౌన్ సమయంలో పెళ్లిళ్లు చేసుకొని ఒక ఇంటివారయ్యారు. ఇక హీరోయిన్లు సైతం తమకు నచ్చినవారిని వివాహమాడి వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఇక తాజాగా మరో టాలీవుడ్ బ్యూటీ సీక్రెట్ గా పెళ్లి పీటలు ఎక్కి నెట్టింట వైరల్ గా మారింది. ‘అత్తారింటికి దారేదీ’ చిత్రంలో పవన్ సరసన ఆడిపాడిన బాపుగారి బొమ్మ ప్రణీత సుభాష్ ఆదివారం రహస్యంగా వివాహం చేసుకోంది. బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త నితిన్ రాజుతో ప్రణీత వివాహం అతికొద్దిమంది కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా జరిగింది. ప్రస్తుతం ఆమె పెళ్ళిఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. అయితే ఇంత సడెన్ గా అమ్మడు పెళ్లి చేసుకోవడానికి కారణం ఏంటి అని అభిమానులు ఆరా తీస్తున్నారు. అయితే ఈ ఫోటోలపై ప్రణీత ఇంతవరకు స్పందించకపోవడం గమనార్హం.

Advertisement

Next Story