ఆ ఇద్దరి గొడవ.. మధ్యలో నాగార్జునకు సంబంధమేంటి.. హీరోయిన్ ట్వీట్ వైరల్

by Anukaran |   ( Updated:2021-10-09 00:21:01.0  )
ఆ ఇద్దరి గొడవ.. మధ్యలో నాగార్జునకు సంబంధమేంటి.. హీరోయిన్ ట్వీట్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కడ విన్నా మా ఎలక్షన్స్ గురించే చర్చ. రేపు జరగబోయే ఈ ఎన్నికలలో ఎవరు గెలుస్తారు అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు ప్యానెల్స్ మధ్య గట్టిగానే పోటీ జరుగుతోంది. ప్రచారాలు, వాగ్వాదాలు, ఆరోపణలు, మతాల యుద్దాలు ఇలా రోజుకో ట్విస్ట్ తో మా ఎలక్షన్స్ రణరంగాన్ని తలపిస్తున్నాయి. ఇక ఇవన్నీ పక్కన పెడితే ఇటీవల మా ఎలక్షన్స్ లో మరో హాట్ టాపిక్ గా మారింది హీరోయిన్ పూనమ్ కౌర్. ప్రకాశ్ రాజ్ కి మద్దతు తెలుపుతూ అమ్మడు పెట్టిన పోస్ట్ ఎంతటి సంచలానాన్ని రేపిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రకాశ్ రాజ్ గెలిస్తే తాను ఇన్ని సంవత్సరాలుగా ఎవరికి చెప్పని విషయాన్ని చెబుతాను, ఎన్నో సంవత్సరాలుగా అనుభవిస్తున్న బాధను బయటపెడతానని తెలిపింది. దీంతో ఆమె చెప్పబోయే విషయం ఏంటి అనేది అందరిని తొలుస్తున్న అనుమానం. ఇక తాజాగా పూనమ్ చేసిన మరో ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.

ఇటీవల దాసరి నారాయణరావు ఫోటోను షేర్ చేస్తూ ఆయన తన తండ్రి లాంటి వారు అన్న పూనమ్ తాజాగా నాగార్జున ఫోటోను షేర్ చేసి ఆయనను ఆకాశానికెత్తేసింది. ప్రకాశ్ రాజ్, నాగార్జున తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేస్తూ “నాగార్జున సర్.. డిగ్నిటీ, గ్రేస్, మంచి మనస్సున్న మనుషులలో ఒకరు. ఆయనకు ఆయన కుటుంబ సభ్యులకు అంతా మంచే జరగాలి అని కోరుకుంటున్నా”అంటూ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్ గా మారింది. అయితే, ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే.. ఈ మా ఎలక్షన్స్ లోకి నాగార్జునను ఎందుకు లాగింది అనేది.

ప్రకాశ్ రాజ్ కి సపోర్ట్ చేస్తున్న అమ్మడు నాగ్ సపోర్ట్ కూడా వారికే ఉందని ఇన్ డైరెక్ట్ గా చెప్తుందా..? లేక నాగ్ సపోర్ట్ కావాలని డైరెక్ట్ గా అడుగుతుందా..? అనేది ప్రశ్నగా మిగిలింది. ఇకపోతే మా ఎలక్షన్స్ పై నాగ్ ఇప్పటివరకు స్పందించలేదు. ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు అనే దానిమీద క్లారిటీ రాలేదు. అస్సలు నాగ్ సామ్ – చై విడాకుల తర్వాత మీడియా ముందుకు వచ్చింది లేదు. కనీసం సోషల్ మీడియా లో ఆ ట్వీట్ తప్ప ఎక్కువ స్పందించనూలేదు. మరి అలాంటిది ఇప్పుడు ఈ ఎలక్షన్స్ కి, విష్ణు- ప్రకాశ్ రాజ్ గొడవలకు, పూనమ్ ట్వీట్ కి, నాగ్ కి సంబంధం ఏంటి..? అని అభిమానులు గుసగుసలాడుతున్నారు.

Advertisement

Next Story