- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సమంతను వాడుకొని వదిలేశారు.. అక్కినేని ఫ్యామిలీ బండారం బయటపెట్టిన హీరోయిన్ (వీడియో)
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ ఏంటి అంటే.. సామ్- చై ల విడాకులు. మొన్నటి వరకు ఈ జంట విడాకులు తీసుకుంటున్నారా..? లేదా అనేదానిమీద చర్చ జరిగితే.. ఇప్పుడు ఎందుకు విడాకులు తీసుకున్నారు..? తప్పు ఎవరిది..? అనేది చర్చనీయాంశంగా మారింది. కొందరు సామ్ ది తప్పు అంటుంటే.. ఇంకొందరు చైతూ తప్పు చేశాడు అంటున్నారు. ఇక వీటిపై ఆ జంట క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటె అది వారి వ్యక్తిగత విషయం అని ప్రముఖులు తేటతెల్లం చేస్తున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు ఈ జంట విడాకులపై పలు రకాలుగా స్పందించారు. ఇక తాజాగా ఈ విషయమై నటి మాధవీలత సంచలన వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం సంచలనంగా మారింది.
సమంత- నాగ చైతన్య విడాకుల విషయంలో మాధవీలత ఘాటు ఆరోపణలు ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచాయి. సమంతను అక్కినేని ఫ్యామిలీ వాడుకొని వదిలేశారని, ఆమెకు తల్లి కావాలని ఉన్నా డబ్బు కోసం ఆమెను రోబోట్ లా మార్చరని ఆరోపించింది. సామ్ డ్రెస్సింగ్ వలనే చైతూ విడాకులు ఇచ్చాడని అందరు అంటున్నారు.. మిగతా వారందరు ఏమైనా మంచిగా ఉన్నారా..? పెళ్లి మండపం నుంచే విడాకుల కోసం కోర్టు మెట్లపై నిలబడిన జంటలను చాలా చూశానని చెప్పుకొచ్చింది. ఇక నాగార్జున మొదటి భార్య గురించి ఎవరు ఎందుకు మాట్లాడం లేదు.. సమంత గురించే ఎందుకు మాట్లాడుతున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన మాధవీలత సమంతను అక్కినేని ఫ్యామిలీ వాడుకొని వదిలేసిందని తెలిపింది.
ఆమె కోట్లు సంపాదించినా ఆమెకు నెలకు పాకెట్ మనీ మాత్రం వేలల్లోనే ఇస్తారని, వాటితోనే ఆమె బతకాలని తెలిపింది. సమంత క్రిస్టియన్ అయినా హిందూ మతాలను గౌరవించిందని, గుళ్లు, గోపురాలకు కాలినడకతో వెళ్లిందని తెలిపింది. సమంత చాలా మంచి మనిషి అని, ఆమెను డబ్బుకోసం ఒక ఏటీఎం లా మాత్రమే చూశారని, 30 ఏళ్ల వయస్సులోనే తల్లి కావాలనుకున్న ఆమెను ఇలా చేయడం అన్యాయమని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం మాధవీలత వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.