- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అమ్మయిన మహేశ్ బాబు హీరోయిన్
దిశ, వెబ్‌డెస్క్: మోడల్‌గా కెరీర్ మొదలుపెట్టి.. హీరోయిన్గా ఎదిగిన నటి అమృతా రావు. కెరీర్ మధ్యలోనే ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుని అభిమానులకు షాక్ ఇచ్చింది. ఆ తర్వాత సినిమాలకు దూరమైన అమృత.. తన ఫ్యాన్స్ కోసం అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఎంట్రీ ఇస్తూనే ఉంది. ఇటీవలే దేవీ నవరాత్రుల సందర్భంగా, నవరాత్రుల్లో తొమ్మిదో నెల అంటూ.. తన బేబీ బంప్ ఫొటోలు ఫ్యాన్స్‌తో పంచుకుంది. కాగా ఆదివారం అమృత పండంటి బిడ్డకు జన్మనిచ్చినట్లు తన కుటుంబ సభ్యులు తెలిపారు.
ప్రముఖ రేడియో జాకీ అన్మోల్తో ఏడు సంవత్సరాల పాటు ప్రేమాయణం సాగించిన అమృత.. 2016లో తనను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైన అమ్మడు.. ఇటీవలే తాను తల్లిని కాబోతున్నట్లు అభిమానులకు తెలిపింది. ఆ తర్వాత ఈ దంపతులు ఎప్పటికప్పుడు పుట్టబోయే బిడ్డ గురించి అప్డేట్స్ ఇస్తూనే ఉన్నారు. ఇక ఆదివారం బేబీ బాయ్‌కు జన్మనివ్వగా, ప్రస్తుతం తల్లీబిడ్డలిద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్టు సమాచారం. దీంతో అభిమానులు, సన్నిహితులే ఈ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే.. అమృత, అన్మోల్‌ల ప్రేమకు ప్రతిరూపమైన ఆ పసివాడి ఫొటో మాత్రం సోషల్ మీడియాకు చిక్కలేదు.
అమృతా రావు విషయానికొస్తే.. తెలుగులో సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన ‘అతిథి’ సినిమాలో నటించింది. ఇక బాలీవుడ్లో ‘వివాహ్, హే బేబీ, వెల్కమ్ టు సజ్జనార్, విక్టరీ, జాలీ ఎల్ఎల్బీ, సింగ్ సాబ్ ది గ్రేట్, సత్యాగ్రహ’ వంటి పలు విజయవంతమైన చిత్రాల్లో నటించింది. భార్య నుంచి తల్లిగా ప్రమోషన్ అందుకున్న అమృత మరి రాబోయే రోజుల్లోనైనా.. సినిమాల్లో కనిపిస్తుందా? లేదా అన్నది చూడాలి.