- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మానవత్వం చాటుకున్న ‘వెంకీమామ’ ఫ్యాన్స్
దిశ, వెబ్‌డెస్క్: విశాఖ జిల్లా యలమంచిలి ప్రాంతానికి చెందిన అప్పారావు అనే వ్యక్తి మొదటినుంచీ సినీ హీరో విక్టరీ వెంకటేష్‌కు వీరాభిమాని. ప్రస్తుతం అప్పారావు కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు. రెక్కాడితే గాని డొక్కాడని ఆయన కుటుంబ సమస్యలు కూడా బోలెడన్ని సమస్యల్లో సతమతమవుతున్నారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర వెంకటేష్ ఫాన్స్ కరస్పాండెంట్ పి.చందు.. తనతో నిత్యం కాంటాక్ట్‌లో ఉన్న అభిమానుల సాయంతో 62,000/- రూపాయలతోపాటు నెలరోజులకి సరిపడే నిత్యావసర వస్తువులు, బట్టలు, మందులు అప్పారావు కుటుంబానికి అనకాపల్లి నూకాంబిక అమ్మవారి సన్నిధిలో అందజేశారు. ఈ సందర్భంగా అప్పారావు కుటుంబ సభ్యులు మాట్లాడుతూ… ఇంత గొప్ప సాయాన్ని అందించిన అభిమానులందరికీ జీవితాంతం మా కుటుంబం ఋణపడి ఉంటుందన్నారు.
అనంతరం అభిమాన సంఘం నాయకులు మాట్లాడుతూ… 2019లో కర్నూల్‌లో చనిపోయిన ఇజ్రాయిల్ కుటుంబానికి రూ.50,000 ఆల్ ఇండియా వెంకటేష్ ఫాన్స్ ఆధ్వర్యంలో అందజేసామని.. మళ్ళీ ఇప్పుడు అప్పారావు కుటుంబానికి 62,000 రూపాయల మొత్తాన్ని అందజేసామని తెలిపారు. గుంటూరు జిల్లా వెంకటేష్ అభిమానులు పెద్ద మొత్తంలో సేకరించి పంపి తమ సేవా నిరతిని చాటుకున్నారని.. మిగతా ఏరియా అభిమానులు సైతం అద్భుతమైన స్పందనని తెలియజేశారని.. వారందరికీ ఈ సందర్భంగా పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అభిమానసంఘాల సమన్వయ కర్త చందు అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్జి శంకర్, పిల్లి శ్రీను, విజయనగరం వాసు, రమెష్, గాజువాక శివకుమార్, రాంబాబు, శరత్, లాయర్ శ్రీను, సతీష్,సోమేశ్, రాము, శ్రీను, దాడి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.!