- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాం ‘ఇస్మార్ట్’ లుక్..
టాలీవుడ్ హీరో, ఎనర్జిటిక్ స్టార్ రాం పోతినేని. నిర్మాత స్రవంతి రవకిశోర్ తమ్ముడి తనయుడు. ‘దేవదాసు’ మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నాడు. ఆ తర్వాత వచ్చిన చిత్రాలలో కొన్ని సక్సెస్ కాగా, కొన్ని అంతగా క్లిక్ కాలేదనే చెప్పాలి. ఇటీవల డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ మంచి బ్రేక్ ఇచ్చింది. అదే ఊపుతో ఇప్పుడు మరో సినిమాలో నటిస్తున్నాడు రాం. కిషోర్ తిరుమల డైరెక్షన్‌లో వస్తున్న ఆ మూవీ పేరు ‘రెడ్’. కిషోర్ డైరెక్షన్‌లో గతంలో వచ్చిన ‘నేను శైలజ’ ఘన విజయం సాధించింది. కాని ‘ఉన్నది ఒకటే జిందగీ’ అంతగా ప్రేక్షకుల ఆదరణ పొందలేకపోయింది. రాం సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడూ యాక్టివ్‌గా లేకపోయినా అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాడు. తాజాగా రాం తన లేటెస్ట్ పిక్ అభిమానులకు షేర్ చేశాడు.
The Sun don’t let you smile.. #summers ☄️ …k..imma head back inside now…🚶♂️
Happy weekend..
Love..#RAPO pic.twitter.com/Q3fqNGa3L3— RAm POthineni (@ramsayz) April 25, 2020
ఈ ఫొటోలో రాం ఎలాంటి మీసాలు, గడ్డాలు లేకుండా.. క్లీన్ షేవ్‌లో కనిపించాడు. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా షూటింగ్‌లకు బ్రేక్ పడిన విషయం తెలిసిందే. దీంతో తారలంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. రాం సరికొత్త లుక్‌లో అచ్చం టీనేజీ కుర్రాడి లాగా కనిపించి షాక్ ఇచ్చాడు. క్లీన్ అండ్ నీట్ షేవ్ లో కనిపించి ఫ్యాన్స్ కి కిక్కిచ్చాడు. మీసం కూడా లేకుండా ఉన్న రాంను చూస్తుంటే హ్యాండ్ సమ్ బాయ్ లాగా ఉన్నాడని నెటిజన్లు, అభిమానులు ప్రశంసిస్తున్నారు. రాం ఫొటోనూ పోస్టు చేస్తూ ‘‘వీకెండ్ ఎంజాయ్ చేయండి’’ అంటూ ట్విట్టర్ వేదికగా ఓ మెసేజ్ కూడా పెట్టాడు. ఇక రాం హీరోగా వస్తున్న రెడ్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా డిజిటల్‌లో రిలీజ్ అవుతుందని ఆ మధ్యవార్తలు వచ్చినా వాటిని రాం కొట్టిపారేశాడు. తన సినిమా లాక్ డౌన్ తర్వాత థియేటర్లలోనే రిలీజ్ అవుతుందని క్లారిటీ కూడా ఇచ్చాడు.
Tags:hero ram, picture, viral, clean shaving, viral, twitter, lock down, covid 19 effect