హీరో రామ్ చరణ్ కు కరోనా పాజిటివ్

by Anukaran |   ( Updated:2020-12-28 21:53:47.0  )
Ram Charan
X

దిశ,వెబ్ డెస్క్: హీరో రామ్ చరణ్ కు కరోనా సోకింది. ఈ విషయాన్ని రామ్ చరణ్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. తనకు ఎటువంటి కరోనా లక్షణాలు లేవన్న చరణ్.., ప్రస్తుతం ఇంట్లో స్వీయ నిర్బంధంలో ఉన్నారు. త్వరలోనే వైరస్ నుంచి కోలుకుని, తిరిగి ఆడియన్స్ ముందుకు వస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు.

మరోవైపు ప్రస్తుతం రామ్ చరణ్ రెండు సినిమాల్లో యాక్ట్ చేస్తున్నారు. రాజమౌళి డైరక్షన్ లో ఎన్టీఆర్ తో కలిసి ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో నడిస్తుండగా.., కొరటాల శివ డైరక్షన్ లో చిరంజీవి హీరోగా షూటింగ్ జరుగుతున్న ‘ఆచార్య’ సినిమాలో రామ్ చరణ్ నక్సలైట్ పాత్రలో కనిపించనున్నారని టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఆచార్య షూటింగ్ లో చెర్రీ సందడి చేశారు. ఆ సినిమా డైరక్టర్ కొరటాల శివ, ఆర్ట్ డైరెక్టర్ సురేష్‌ సెల్వరాజన్‌తో సంభాషించారు.

Advertisement

Next Story