- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
హీరో మహేశ్‌బాబు పెద్దమనసు
దిశ, ఏపీ బ్యూరో: సూపర్‌స్టార్ మహేశ్‌బాబు తన స్వగ్రామం బుర్రిపాలెంను దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ గ్రామంలో మహేశ్‌బాబు, నమ్రత దంపతులు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. కరోనా సంక్షోభ సమయంలోనూ బుర్రిపాలెం గ్రామస్తుల ఆరోగ్యంపై ప్రిన్స్ దంపతులు ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే, గ్రామంలో ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయించారు. మహేశ్ బాబు తన తండ్రి కృష్ణ జన్మదినం సందర్భంగా విజయవాడకు చెందిన ఆంధ్రా హాస్పిటల్స్ సహకారంతో మే 31న కరోనా వ్యాక్సిన్ తొలి డోసు ఇప్పించారు.
తాజాగా ఆదివారం రెండో డోసు కూడా వేయించారు. కరోనా వ్యాక్సినేషన్ వేయించినందుకు ప్రిన్స్ మహేశ్‌బాబు దంపతులకు గ్రామస్థులు ధన్యవాదాలు తెలిపారు. దత్తత గ్రామమైన బుర్రిపాలెంలో అనేక సేవా కార్యక్రమాలను చేపట్టిన మహేశ్‌బాబు రాష్ట్రవ్యాప్తంగా గుండె జబ్బులతో బాధపడుతున్న చిన్నారులకు ఆపరేషన్లు చేయిస్తున్న సంగతి తెలిసిందే.