క్రికెట్ అభిమానులకు ట్విట్టర్ స్పెషల్ ఫీచర్స్

by Anukaran |   ( Updated:2021-04-11 06:25:13.0  )
క్రికెట్ అభిమానులకు ట్విట్టర్ స్పెషల్ ఫీచర్స్
X

దిశ, ఫీచర్స్: కళ్లు చెదిరే సిక్సులు, వికెట్లను గిరాటేసే బంతులు, ఎక్స్‌పరిమెంటల్ షాట్స్, చెదిరిపోయే రికార్డులు, కెప్టెన్ వ్యూహాలు, కామెంటేటర్ల చెణుకులు వెరసి క్రికెట్ ప్రేమికులకు రెండు నెలల పాటు ఉత్కంఠభరిత క్షణాలను, అంతులేని ఆనందాలను అందిస్తుంది ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL). ఇప్పటికే తొలి మ్యాచ్ చివరి బంతి వరకు ప్రేక్షకులకు థ్రిల్‌నందించగా, రెండో మ్యాచ్ ఏకపక్షంగా సాగింది. జరిగిన రెండు మ్యాచ్‌లకే బోలెడన్నీ విశ్లేషణలు కొనసాగుతున్నాయి. మే వరకు సాగే ఈ సమరంలో మరెన్నో క్రికెట్ కన్వర్జేషన్స్ జరుగుతాయి. మరి ఐపీఎల్ సంభాషణల్లో పాల్గొనాలని మీరు అనుకుంటున్నారా? అయితే ట్విట్టర్ ఐపీఎల్ క్రికెట్ సీజన్‌ 2021కు సంబంధించిన అభిమానుల సంభాషణల్లో పాల్గొనడానికి వీలు కల్పించే ముఖ్యమైన ఫీచర్స్‌ను హైలైట్ చేస్తోంది. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం.

2019తో పోల్చితే 2020‌లో క్రికెట్ సీజన్‌లో ‘కన్వర్జేషన్స్’ సుమారు 23 శాతం పెరిగాయని, ఈ ఏడాది మహమ్మారి కొనసాగుతున్నందున, క్రికెట్ గురించి చర్చించడానికి ఎక్కువ మంది వినియోగదారులు ట్విట్టర్ వేదికను ఆశ్రయిస్తారని ట్విట్టర్ భావిస్తుంది.

ట్విట్టర్ స్పేసెస్

‘ట్విట్టర్ స్పేసెస్’ యూజర్లను వర్చువల్‌గా గ్యాదర్ కావడానికి, ప్రత్యక్ష ఆడియో సంభాషణలను పంచుకోవడానికి అనుమతిస్తుంది. ఈ ఫీచర్ ప్రస్తుతం బీటా వెర్షన్‌లో ఉన్నా, కొన్ని ఐపిఎల్ జట్లు ఈ ఫీచర్‌ను ఉపయోగించుకుంటున్నాయి. దాంతో ఒకవేళ యూజర్లు తమ సొంత ‘ట్విట్టర్ స్పేసెస్’ ప్రారంభించకపోయినా, ఆయా జట్లు ఇప్పటికే వినియోగిస్తున్న ‘స్పేసెస్’‌లో వినియోగదారుడిగా పాల్గొనవచ్చు. ఇటీవల జహీర్ ఖాన్‌తో కలిసి ముంబై ఇండియన్స్ టీమ్ ట్విట్టర్ స్పేస్ కన్వర్జేషన్ నిర్వహించి, దేశంలోనే మొదటి స్పోర్ట్స్ క్లబ్‌గా నిలిచింది. జహీర్ ఖాన్ అభిమానులతో సంభాషించడంతో పాటు రాబోయే ఐపిఎల్ సీజన్ కోసం ఎలాంటి ప్రణాళికలు అమలు చేస్తున్నారో పంచుకున్నాడు.

ఎమోజీ

ట్విట్టర్ కొత్తగా ఎనిమిది కొత్త జెర్సీ ఎమోజీలను విడుదల చేసింది. యూజర్లు ఈ ఎమోజీలను అన్‌లాక్ చేయొచ్చు, టీమ్ హ్యాష్‌ట్యాగ్‌లను ఉపయోగించి ట్వీట్ చేయడం ద్వారా ప్రత్యక్ష సంభాషణల్లోనూ పాల్గొనవచ్చు. జట్టు ఎమోజీలను అన్‌లాక్ చేసే కొన్ని హ్యాష్‌ట్యాగ్‌లను చూద్దాం.. #IPL2021, #MumbaiIndians, #OneFamily, #WhistlePodu, #விசில்போடு, #WeAreChallengers, #HallaBol, #RoyalsFamily, #PunjabKings, #SaddaPunjab, #KKRHaiTaiyaar, #KorboLorboJeetbo, #YehHaiNayiDilli and #OrangeArmy.

టాపిక్స్

ట్విట్టర్ యూజర్స్ ‘టాపిక్స్’(క్రికెట్, ఐపిఎల్ సిరీస్, జట్టుల పేర్లు) సాయంతో స్పెసిఫిక్ సబ్జెక్ట్ ఎంచుకుని ‘కన్వర్జేషన్స్’లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఈ ఫీచర్ ఒక అంశానికి సంబంధించిన ట్వీట్లను ఒక దగ్గరకు చేరుస్తుంది. ఒక వ్యక్తి ఒక ‘టాపిక్’ అనుసరిస్తే..వాటికి రిలేటెడ్ విషయాన్ని ఎవరూ ట్వీట్ చేసినా చూడొచ్చు. ఇక లైవ్ స్కోర్స్ చూడటానికి ‘స్కోర్ కార్డ్’ చూడొచ్చు. ఇది ఈవెంట్ పేజ్ టాప్‌లో ఉంటుంది.

Advertisement

Next Story

Most Viewed