డ్రీమ్ గర్ల్ నుంచి షారుఖ్‌కు ఫోన్ కాల్.. నమ్మలేకపోయాడట!

by Jakkula Samataha |
డ్రీమ్ గర్ల్ నుంచి షారుఖ్‌కు ఫోన్ కాల్.. నమ్మలేకపోయాడట!
X

దిశ, సినిమా : డ్రీమ్ గర్ల్ హేమమాలిని దర్శకత్వం వహించిన ‘దిల్ ఆస్నా హై’ ద్వారా షారుఖ్ ఖాన్‌కు ఫస్ట్ టైమ్ బిగ్ స్క్రీన్ ఆఫర్ వచ్చింది. ‘ఫౌజీ, సర్కస్’ టెలివిజన్ సీరియల్స్‌లో షారుఖ్ నటనతో ఇంప్రెస్ అయిన హేమమాలిని.. తన నంబర్‌ కనుక్కుని మరీ కాల్ చేసిందట. అయితే ఈ విషయాన్ని నమ్మని కింగ్ ఖాన్.. మళ్లీ రీకాల్ చేసి తను నమ్మలేకపోతున్నానని, రెండు రోజుల తర్వాత కలుస్తానని తెలిపాడని చెప్పింది. అప్పుడు ఇంటికి వచ్చిన షారుఖ్, ధర్మేంద్రను కూడా కలిశారని తెలిపింది.

సినిమాలో హీరోగా తనను తీసుకుంటున్నానని ధర్మేంద్రకు చెప్పినప్పుడు బెస్ట్ సెలెక్షన్ అని కూడా చెప్పారని గుర్తుచేసుకుంది. కాగా కెరియర్ ప్రారంభంలోనే హేమమాలినితో పనిచేయడం గర్వంగా అనిపించిందని చాలా సందర్భాల్లో చెప్పిన షారుఖ్.. ‘దిల్ ఆస్నా హై’ చిత్రంలో దివ్యభారతితో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అయితే షారుఖ్ తొలి సినిమా ‘దీవానా’ 1992లో రిలీజ్ కాగా.. అదే ఏడాది ‘దిల్ ఆస్నా హై’ విడుదలైంది.

Advertisement

Next Story