బీర్ కంపెనీ కస్టమర్లకు క్షమాపణ

by vinod kumar |
బీర్ కంపెనీ కస్టమర్లకు క్షమాపణ
X

దిశ, వెబ్‌డెస్క్: ఓ బీర్ కంపెనీ సరికొత్త బీర్‌(Beer)ను కనుగొంది. కస్టమర్లను ఆకర్షించడం కోసం కొత్తరకం పేరు పెట్టింది. అయితే ఆ పేరు ఓ భాషలో బూతు పదమని ఓ వ్యక్తి కంపెనీకి తెలపడంతో బీరు పేరును మార్చుతూ.. కొత్తగా మరో పేరును ప్రకటించబోతున్నట్టు బీర్ కంపెనీకి తెలిపింది. ఈ ఘటన కెనడాలో చోటుచేసుకుంది. వివరాలు ఉన్నాయి.

కెనడాకు చెందిన హెల్స్ బేస్‌మెంట్(Hells Basement) బీర్ కంపెనీ కొత్తరకం బీర్‌ను కనిపెట్టింది. ప్రజలను ఆకర్షించడం కోసం ‘హురుహురు’ అనే పేరునూ పెట్టింది. మావోరీ భాషలో తేలికైన ఈక అనే అర్థం అనుకుంది. కానీ, అదో బూతు పదం(మర్మాంగం వద్ద ఉండే వెంట్రుకలు ) అని మావోరీ టీవీలో పనిచేసే ఓ వ్యక్తి ఫేస్‌బుక్ వీడియో ద్వారా కంపెనీకి తెలిపాడు. దీంతో సదరు కంపెనీ కష్టమర్లకు క్షమాపణ చెబుతూ.. బీర్‌కు త్వరలోనే కొత్త పేరును పెట్టనున్నట్టు ప్రకటించింది.

Advertisement

Next Story

Most Viewed