ఢిల్లీలో హై అలర్ట్: 5 వేల మందితో ఎర్రకోట వద్ద భారీ భద్రత

by Anukaran |   ( Updated:2021-08-13 22:16:14.0  )
Heavy security in Red Fort
X

దిశ, వెబ్‌డెస్క్: భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలే లక్ష్యంగా దేశ రాజధాని ఢిల్లీలో ఉగ్రవాదులు భారీ అల్లర్లకు కుట్ర చేస్తోన్న విషయం తెలిసిందే. నిఘా సంస్థలు సూచించిన నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు, భారత ఆర్మీ దేశవ్యాప్తంగా అలర్ట్ అయ్యారు. ఇప్పటికే శుక్రవారం ఢిల్లీ నగర వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు నిర్వహించిన పోలీసులు భారీగా ఆయుధాలు, అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 55 సెమీ ఆటోమోటెడ్ పిస్టల్స్, 50 బుల్లెట్స్ స్వాధీనం చేసుకున్నట్లు స్పష్టం చేసిన సంగతి విధితమే. అయితే.. స్వాతంత్ర దినోత్సవం సమీపిస్తోన్న నేపథ్యంలో దేశంలో ఎలాంటి అల్లర్లు, బాంబ్ బ్లాస్ట్‌లు జరుగకుండా ఉండేందుకు భారత భద్రతా బలగాలు అప్రమత్తం అయ్యాయి. ఢిల్లీ నగరంలో హై అలర్ట్ ప్రకటించారు. ఇందులో భాగంగానే ఢిల్లీలోని ఎర్రకోట వద్ద ఐదువేల మంది సిబ్బందితో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ఎత్తైన భవనాలపై ఎన్ఎస్‌జీ, స్వాత్ కమాండోల పహారా నిర్వహిస్తున్నారు. అంతేగాకుండా.. ఎత్తైన భవనాలపై కైట్ క్యాచర్స్, షార్ప్ షూటర్‌లను రెడీగా పెట్టినట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story