- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అత్యవసరమైతేనే బయటకు రండి : మంత్రి సబితా ఇంద్రారెడ్డి
దిశ ప్రతినిధి, రంగారెడ్డి: రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తోన్న అకాల వర్షాల కారణంగా జన జీవనం అతలాకుతలం అయింది. రోడ్లు చెరువులను తలపించాయి. ఇళ్లలోకి వరదనీరు చేరి, బయట కాలు పెట్టలేని పరిస్థితి నెలకొంది. దీంతో జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల అధికారులు, ప్రజాప్రతినిధులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు. అవసరం ఉంటే వరద బాధిత కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు. చెరువుల వద్ద మున్సిపాలిటీ, కార్పొరేషన్‌ల ఆధ్వర్యంలో గస్తీ ఏర్పాటు చేయాలని సూచించారు.
అంతేగాకుండా.. ప్రజలెవరూ ఇండ్ల నుంచి బయటకు రావొద్దని, అత్యవసరం ఉంటేనే తగు జాగ్రత్తలు తీసుకొని రావాలని తెలిపారు. జిల్లా కలెక్టరేట్‌తో పాటు, అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. రంగారెడ్డి కంట్రోల్ రూమ్ నెంబర్ 040-2323 0817, మీర్‌పేట్ 9849171748, బడంగ్ పేట్ 9000284313, జల్ పల్లి 8309693118, తుక్కుగూడ 8125491026 లను సంప్రదించాలని సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. విపత్కర పరిస్థితుల్లో 24 గంటలు అందుబాటులో ఉండేలా మాన్‌సూన్ ఎమర్జెన్సీ టీమ్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్ సిబ్బంది సిద్ధంగా ఉన్నారన్నారు. గులాబ్ తుఫాను నేపథ్యంలో ప్రాణ, ఆస్తి నష్టం జరుగకుండా చర్యలు తీసుకుంటున్నామని, పోలీస్, రెవెన్యూశాఖలు సమన్వయంతో పని చేయాలని మంత్రి సూచించారు.