- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఓ వైపు ఆనందం.. మరోవైపు అంతరాయం
by Shyam |
X
దిశ, వనపర్తి : శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు పెబ్బేరు మండల పరిధిలోని పలువాగులు పొంగి పొర్లి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గతవారం రోజులుగా జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అదే క్రమంలో శనివారం పలు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. పెబ్బేరు మండల పరిధిలోని కంచిరావుపల్లి చేపలవాగు వనపర్తి ప్రధాన రహదారిపై భారీగా వరద నీరు ప్రవహించటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
కొల్లాపూర్ పెబ్బేరు ప్రధాన రహదారిపై ఉన్న శేరుపల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో సుమారు రెండు గంటలపాటు రాకపోకలు నిలిచిపోయాయి. బున్యాదిపురం, రంగపూర్ మద్య ఉన్న పెద్దవాగు ఉధృతికి ఇరు గ్రామాల మద్య రాకపోకలు నిలిచిపోయాయి. జిల్లాలో కురిసిన వర్షాలకు పలు చెరువులు అలుగు ఎక్కి పారాయి. రైతులు కురిసిన వర్షాలకు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
Next Story