- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రేపు, ఎల్లుండి భారీ వర్షాలు
దిశ, న్యూస్‌బ్యూరో: వచ్చే రెండ్రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. బుధవారం నుంచి శుక్రవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. బుధవారం నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, నల్గొండ, మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాల, నాగర్ కర్నూల్, నారాయణపేట జిల్లాల్లో మిగిలిన ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు.
గురువారం ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి జిల్లాలు మినహా మిగిలిన జిల్లాల్లో భారీ వర్షం పడే అవకాశాలున్నట్లు తెలిపారు. శుక్రవారం కూడా ఆదిలాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్‌తో పాటు కరీంనగర్ ఉమ్మడి జిల్లాల పరిధిలో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. బుధవారం జీహెచ్ఎంసీ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షం, గురువారం దాదాపు అన్ని ప్రాంతాల్లో వర్షాలు పడుతాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. కాగా మంగళవారం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వర్షం కురిసింది. సంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 2.1 సెంటీమీటర్ల వర్షం కురిసింది.