- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఏపీలో విస్తారంగా వర్షాలు
by srinivas |

X
దిశ, ఏపీబ్యూరో :
తెలుగు రాష్ట్రాల్లో ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని విశాఖపట్టణం వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ప్రకటించింది. గడచిన 24 గంటల్లో ఏపీలోని పలుచోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాతో పాటు గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో ఏపీలోని కోస్తా, రాయలసీమతో పాటు మధ్య తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ స్పష్టంచేసింది.
Next Story