ధాన్యం కొనుగోళ్లలో రైతులు సహకరించాలి : కయ్యం నరసింహ రెడ్డి

by Aamani |
ధాన్యం కొనుగోళ్లలో రైతులు సహకరించాలి : కయ్యం నరసింహ రెడ్డి
X

దిశ,నిజాంసాగర్ : రైతులు పండించిన వరి ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు పూర్తి చేస్తామని, రైతులు సహకరించాలని అచ్చంపేట సహకార సంఘం అధ్యక్షులు కయ్యం నర్సింహా రెడ్డి అన్నారు. శుక్రవారం నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట సహకార సంఘం మహాజన సభ సమావేశం రైతు వేదికలో అధ్యక్షుడు కయ్యం నర్సింహా రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో సీఈఓ సంగమేశ్వర్ గౌడ్ గత ఆరు మాసాల జమా, ఖర్చుల వివరాలను చదివి వినిపించారు. అనంతరం చైర్మన్ కయ్యం నరసింహ రెడ్డి మాట్లాడుతూ రబీ సీజన్ వరి కొనుగోలు కేంద్రాల ఏర్పాటు పూర్తి చేశామని రైతులు అధైర్య పడొద్దని కోరారు. కొనుగోలు సకాలంలో పూర్తి చేసేందుకు రైతులు సహకరించాలని సూచించారు. గత ఖరీఫ్,రబీ సీజన్ లో 4 లక్షల 33 వేల 671 బస్తాలు 2984 మంది రైతుల నుంచి కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు.

దీనికి గాను రూ. 40 కోట్ల 24 లక్షల 46 వేల 688 రూపాయలను రైతుల ఖాతాలో జమ చేసినట్లు పేర్కొన్నారు. గత సీజన్ వరి ధాన్యం కొనుగోళ్లు లో రాష్ట్ర ప్రభుత్వం నుండి కమిషన్ డబ్బులు రూ. 55,50,988 రూపాయలు రావాల్సి ఉందని తెలిపారు. అదేవిధంగా స్వల్ప కాలిక రుణమాఫీ 392 మంది రైతులకు గాను రూ. 1,67,37,492 రూపాయలు వచ్చినట్లు తెలిపారు. నిజాంసాగర్,మాగి 2,సుల్తాన్ నగర్,మర్పల్లి గ్రామాల కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఐకేపి సంఘాలకు అప్పగించినట్లు తెలిపారు. ప్రభుత్వం మద్దతు ధర ఏ 1 గ్రేడ్ రూ.2,320 రూపాయలు,కామన్ రకానికి రూ.2300 మరియు సన్నరకం వడ్లకు రూ. 500 బోనస్ అందిస్తున్నట్లు పేర్కొన్నారు.

వన్ టైం సెటిల్మెంట్ జూన్ వరకు పొడిగించాలి రైతుల డిమాండ్..

సహకార సంఘం రైతుల బకాయిలను 40 శాతం రాయితీపై కట్టుకునే సౌకర్యం మార్చి 30 వరకు కల్పించడం పై రైతులు ఆందోళన చేపట్టారు. మార్చి మాసం చివరి వరకు రైతుకు పంట చేతికి రాని పక్షంలో రైతులు లబ్దిపొందేదుకు అవకాశం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్డిసీసీ బ్యాంకు అధికారులు రైతులను దృష్టిలో పెట్టుకుని రాయితీ పై రైతుల బకాయిలను కట్టుకునేందుకు జూన్ 30వ తేదీ వరకు పొడిగించాలని రైతులు డిమాండ్ చేశారు. ప్రస్తుతం రైతులకు పంటలు చేతికి రాని పక్షంలో జూన్ మాసం వరకు జొన్న పంటలు,మొక్క,వరి పంటలు కొనుగోలు పూర్తి చేసుకునే అవకాశం ఉండటంతో రైతులకు బాకాయిలను జూన్ వరకు పొడిగించాలని ఎన్డిసీసి బ్యాంకు అధికారులను వేడుకున్నారు. లేని పక్షంలో రైతులు నష్టపోతామని ఆందోళన చెందారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘం చైర్మన్ కయ్యం నర్సింహా రెడ్డి,వైస్ చైర్మన్ శ్రీనివాస్,సిఈఓ సంగమేశ్వర్ గౌడ్,డైరేక్టర్లు,గజ్జల రాములు,సంకు లక్ష్మయ్య,గవ్వల అంజయ్య,రామకృష్ణ,పిట్ల సత్యనారాయణ,చాకలి రమేష్,బంగ్లా ప్రవీణ్,సంఘం సభ్యులు,రైతులు సిబ్బంది రాహుల్, బాబా సింగ్,కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Next Story