ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో కాల్పుల మోత.. 15 మంది మావోయిస్టుల మృతి..

by Aamani |   ( Updated:2025-03-29 04:15:08.0  )
ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో కాల్పుల మోత.. 15 మంది మావోయిస్టుల మృతి..
X

దిశ,భద్రాచలం: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా గోగుండా‌కొండపై ఉపంపల్లి ప్రాంతంలో శనివారం ఉదయం నుంచి మావోయిస్టులకు భద్రతా బలగాలకు భీకరంగా ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇప్పటి వరకు మొత్తం 15 మంది మావోయిస్టులు మృతి చెందారు. అయితే, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది. ఈ కూబింగ్‌లో డీఆర్జీ, సీఆర్‌పీఎఫ్ జవాన్లు సంయుక్తంగా పాల్గొన్నారు. ఈ మేరకు ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలో భద్రతా దళాలు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి. ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.

Next Story

Most Viewed