- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
15 నిమిషాల్లో ఇంటికి పనిమనిషి సేవలు ప్రారంభించిన అర్భన్ కంపెనీ.. నెట్టింట తీవ్ర చర్చ!

దిశ, వెబ్ డెస్క్: మీ బిజీ లైఫ్ (Busy life) షెడ్యూల్‌లో ఇల్లు ఊడవడం, తుడవటం, వంట పని సహా తదితర పనులు చేసే పెట్టేందుకు వర్కర్ల (Workers) కోసం చూస్తున్నారా? అయితే, ఇప్పుడు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటే.. కేవలం 15 నిమిషాల్లోనే ఇంటికి వచ్చి ఈ పనులన్నీ చేసేస్తారు. ఈ వినూత్న ఆలోచనకు ప్రముఖ ఆన్ లైన్ సర్వీసెస్ సంస్థ అర్బన్ కంపెనీ (Urban company) శ్రీకారం చుట్టింది.
అర్బన్ కంపెనీ తాజాగా 'ఇన్‌స్టా మెయిడ్స్/ఇన్‌స్టా హెల్ప్' (Insta maids) అనే సర్వీసులను ప్రారంభించింది. దీని ద్వారా కేవలం 15 నిమిషాల్లోనే మీ ఇంటికి పని మనిషి వస్తారు. ఈ విషయాన్ని కంపెనీ స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. అయితే, ప్రస్తుతం ఈ సేవలు కేవలం ముంబైలో మాత్రమే ప్రవేశపెట్టగా, త్వరలోనే ఇతర నగరాలకు విస్తరిస్తామని తెలిపింది. ఇక ఈ సేవలు గంటకు రూ.49లకే అందిస్తున్నట్లు వివరించింది. అయితే, ఇది పరిమిత కాల ఆఫర్ అని పేర్కొంది.
'అర్బన్ కంపెనీలో, మా సేవా భాగస్వాముల శ్రేయస్సుకు మేము కట్టుబడి ఉన్నాము. ఈ కొత్త సర్వీస్ ఆఫర్ లో, భాగస్వాములు ఉచిత ఆరోగ్య బీమా, ఆన్-ది-జాబ్ లైఫ్ & యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ తో పాటు గంటకు రూ. 150-180 సంపాదిస్తారు. నెలకు 132 గంటలు (22 రోజులు × రోజుకు 6 గంటలు) పనిచేసే భాగస్వాములకు నెలకు కనీసం రూ.20,000 ఆదాయం లభిస్తుంది' అని సంస్థ సోషల్ మీడియాలో పోస్టులో రాసుకొచ్చింది.
ఇక ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారటంతో నెటిజన్ల నుంచి భిన్నమైన స్పందన వస్తుంది. కొంత మంది నెటిజన్లు ఈ సేవలను స్వాగతించగా, మరికొందరు ఈ సేవ మానవ హక్కుల ఉల్లంఘన అని, ఇంకొంత మంది ఈ సేవల్లో బేబీ సిట్టింగ్ సర్వీసును చేర్చాలని కోరుతూ కామెంట్లు పెడుతున్నారు. అలాగే ఈ సర్వీసులో మెయిడ్ అనే పదం చేర్చటంపై కూడా నెటిజన్లు విపరీతంగా చర్చించుకుంటున్నారు.