వానొచ్చే.. ఇళ్లలోకి బురదోచ్చే..

by Shyam |
burad
X

దిశ, డోర్నకల్: మరిపెడ మునిసిపాలిటీగా మారి రెండు సంవత్సరాలు పూర్తి అయినప్పటికీ ఎటువంటి అభివృద్ధి సాధించటం లేదు. చిన్న చిన్న వర్షాలకే రోడ్లపై వరద నీరు, బురద చేరుతోంది. శనివారం కురిసిన భారీ వర్షానికి మున్సిపాలిటీ కేంద్రంలోని 9వార్డు గ్యామ తండాలో వీధులు నిండిన చెరువులను తలపించాయి. డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా విఫలం కావడంతో పట్టణంలోని వర్షపు నీరు మొత్తం తండా లోకి ప్రవేశించింది.

దీంతో ఇళ్లల్లోకి చెత్తాచెదారం, మురుగు నీరుతో పాటు చేరటంతో తండా వాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అధికారులతో ఎన్నిసార్లు విన్నవించుకున్న పరిస్థితిలో మార్పు లేదని తండా వాసులు వాపోతున్నారు. సైడు కాలువలు ఆక్రమణకు గురి కావడంతో సమస్య తీవ్ర రూపం దాల్చి తండా వాసులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు తక్షణమే స్పందించి కాలువలపై ఆక్రమణలు తొలగించి వర్షపు నీరు సరైన క్రమంలో పోయే విధంగా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Next Story