తనిఖీల్లో భారీగా బంగారం పట్టివేత..!

by Sumithra |
తనిఖీల్లో భారీగా బంగారం పట్టివేత..!
X

దిశ, వెబ్‎డెస్క్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చేపట్టిన వాహన తనిఖీల్లో భారీగా బంగారు, వెండి ఆభరణాలు పట్టుబడ్డాయి. జిల్లాలోని అంబేదర్కర్ సెంటర్ వద్ద బుధవారం పాల్వంచ పట్టణ సీఐ సత్యనారాయణ, ఎస్ఐ ప్రవీణ్ కుమార్ తమ సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు చేపట్టారు. ఒక సంచితో అనుమానాస్పదంగా వస్తున్న స్కూటీలో తనిఖీలు చేయగా, అందులో బంగారం, వెండి వస్తువులను గుర్తించారు.

నిందితులు పూసపాటి శ్రీనివాస్ అలియాస్ సిండికేట్ శ్రీను, ఐనాల కృష్ణగా గుర్తించారు. శ్రీనివాస్ 14 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. నిందితుల వద్ద నుంచి 575 గ్రాముల బంగారు వస్తువులు, 4.5 కేజీల వెండి వస్తువులు, ఒక గ్యాస్ సిలిండర్,సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీరంతా విలాసవంతమైన జీవితానికి అలవాటుపడి దొంగతనాలు చేస్తున్నట్లుగా పోలీసులు వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed