మున్నేరు ఉగ్రరూపం.. స్థానికులను అప్రమత్తం చేసిన అధికారులు

by Sridhar Babu |   ( Updated:2021-07-23 01:00:55.0  )
Munneru Vagu
X

దిశ, ఖమ్మం రూరల్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో గత నాలుగు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రూరల్ ​మండలం తీర్థాల వద్దనున్న మున్నేరు, ఆకేరులకు వరదనీరు వచ్చి చేరడంతో తీర్థాల గోళ్లపాడుకు రాకపోకలు నిలిచాయి. ముందస్తు చర్యలో భాగంగా రూరల్ ​జెడ్పీటీసీ యండపల్లి వరప్రసాద్, స్థానిక సర్పంచ్​ తేజావత్​ బాలునాయక్, సీఐ సత్యనారాయణరెడ్డి, ఎస్ఐ శంకర్​రావులు బారికెడ్లను ఏర్పాటు చేశారు. ప్రజలు ఎవరు అటువైపు వెళ్లకుండా ఉండేందుకు తగు బందోబస్తును ఏర్పాటు చేశారు. తీర్థాల, గోళ్లపాడు మధ్య ఉన్న వంతెన మీద నుంచి దాదాపు 25అడుగుల మేర వరదనీరు ప్రహహిస్తోంది. మున్నేరు పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రూరల్ ఎంపీపీ ఉమా అధికారులను ఆదేశించారు. నీట మునిగిన వంతెన స్థానంలో హై లెవల్​వంతెన నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.

Advertisement

Next Story