- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రాజెక్టులకు ముంచెత్తుతున్న వరద
దిశ, న్యూస్ బ్యూరో: రాష్ట్రంలోని ప్రాజెక్టులకు వరద ముంచెత్తుతున్నది. కృష్ణా, గోదావరి రెండు నదుల్లోనూ వరద వస్తోంది. ఆల్మట్టికి వరద కొనసాగుతోంది. బుధవారం వరకు 27,658 క్యూసెక్కులు వస్తుండగా నీటిని అంచనా వేస్తూ దిగువకు 46,140 క్యూసెక్కులు వదలుతున్నారు. నారాయణపూర్ జలాశయం కూడా దాదాపుగా నిండటంతో వచ్చిన వరదను వచ్చినట్టే విడుదల చేస్తున్నారు. 43,131 క్యూసెక్కుల ఇన్ ఫ్లో, 45,995 క్యూసెక్కుల ఔట్ ఫ్లో నమోదవుతోంది. జూరాల ప్రాజెక్టుకు 64 వేల క్యూసెక్కులు వస్తుండగా 8 గేట్లను ఎత్తి స్పిల్ వే ద్వారా 42,442 క్యూసెక్కులు, విద్యుత్ ప్లాంట్ల ద్వారా 28779 క్యూసెక్కులు వదులుతున్నారు. నెట్టెంపాడు, బీమా, సమాంతర కాల్వ, కోయిల్‌సాగర్, కుడి, ఎడమ కాల్వలకు నీటి విడుదల కొనసాగిస్తున్నారు. జూరాల నుంచి మొత్తం ఔట్ ఫ్లో 75881 క్యూసెక్కులు ఉంది. ఇక శ్రీశైలం ప్రాజెక్టుకు వరద పెరిగింది. జూరాల నుంచి వరద జలాలు శ్రీశైలానికి చేరాయి. బుధవారం సాయంత్రం వరకు శ్రీశైలం ప్రాజెక్టులోకి 49వేల క్యూసెక్కులకుపైగా వరద వస్తోంది.
అదే విధంగా గోదావరిలోనూ వరద మొదలైంది. ఎస్సారెస్పీకి 1525 క్యూసెక్కల వరద స్థిరంగా కొనసాగుతోంది. అంతే స్థాయిలో దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 34టీఎంసీల నీరు నిల్వ ఉంది. మధ్య మానేరు నుంచి దిగువకు వరదను విడుదల చేస్తున్నారు. దీనికి ఇంకా ఇన్ ఫ్లో రావడం లేదు. ఇక్కడ 11 టీఎంసీల నీరు నిల్వ ఉండటంతో దిగువనకు వదులున్నారు. ఎల్ఎండీకి 8936 క్యూసెక్కుల ఇన్ ఫ్లో నమోదైంది. కడెం ప్రాజెక్టు 2074 క్యూసెక్కులు వస్తున్నాయి. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 3959 క్యూసెక్కుల వరద వస్తుండటంతో దిగువకు 2748 క్యూసెక్కులు వదలుతున్నారు. గోదావరి డెల్టాలో 48వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా, 44 వేల క్యూసెక్కుల ఔట్ ఫ్లో నమోదవుతోంది.