బాపూజీనగర్‌లో భారీ అగ్నిప్రమాదం

by Sumithra |
బాపూజీనగర్‌లో భారీ అగ్నిప్రమాదం
X

దిశ, న్యూస్‌బ్యూరో: బోయిన్‌పల్లి‎ పరిధి బాపూజీనగర్‎లో శుక్రవారం అగ్ని ప్రమాదం జరిగింది. ఓ గుడిసెలో ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలింది. పేలుడు దాటికి మంటలు పెద్ద ఎత్తున చెలరేగి చుట్టు పక్కల ఉన్న గుడిసెలకు వ్యాపించాయి. దీంతో మొత్తం 11 గుడిసెలు కాలి బూడిద అయ్యాయి. ఓ ఆటో కూడా దగ్ధం అయినట్లు తెలుస్తోంది. సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో భారీ ఆస్తి నష్టం జరిగిందని.. కట్టు బట్టలతో రోడ్డు మీద పడ్డామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదస్థలిని పరిశీలించిన మంత్రి మల్లారెడ్డి.. బాధితులకు అన్ని విధాలుగా సహాయం చేస్తామని భరోసా ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే మల్లారెడ్డి సతీమణి కల్పన రెడ్డి బాధితులకు తక్షణ సాయంగా రూ. లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించారు.

Advertisement

Next Story