- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నీట మునిగిన కోల్‌కతా ఎయిర్‌పోర్ట్
అంఫాన్ సూపర్ సైక్లోన్ ధాటికి పశ్చిమ బెంగాల్ గజగజ వణికింది. ఆరు గంటల పాటు 150 కిలోమీటర్ల వేగంతో గాలులు, కుంభవృష్టి కురవడంతో కోల్‌కతా అతలాకుతలమైంది. ముఖ్యంగా కోల్‌కతా విమానాశ్రయం పూర్తిగా నీట మునిగింది. రన్‌వేపై నడుము లోతు వరద నీరు చేరింది. దీంతో విమానాశ్రయాన్ని క్లోజ్ చేశారు. సైక్లోన్ ధాటికి పశ్చిమ బెంగాల్‌లో 12 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు.
బుధవారం మధ్యాహ్నం 3గంటల సమయంలో బెంగాల్‌పై అంఫాన్ విలయ తాండవం చేసిందని సీఎం మమత బెనర్జీ పేర్కొన్నారు. ఇది కరోనా కన్నా మహా విపత్తు అని… లక్షల కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని, అయినా అధికారులు సైక్లోన్ తీవ్రతను సరిగా అంచనా వేయలేకపోయారని మమత అభిప్రాయపడ్డారు.
అంఫాన్ స్లైకోన్ ప్రధానంగా ఉత్తర, దక్షిణ 24 పరగణాలు, మిడ్నాపూర్, హుగ్లీ, కోల్‌కతాలపై తీవ్ర ప్రభావం చూపింది. 1999లో ఒడిషా తీరాన్ని తాకిన తుఫాన్ తరువాత బంగాళాఖాతంలో ఏర్పడిన అంతటి భయంకరమైనది అంఫాన్ సైక్లోన్ అని అధికారులు అంచనా వేస్తున్నారు.