వామదేవ ఆసనం ప్రయోజనాలేంటి?

by Hamsa |
వామదేవ ఆసనం ప్రయోజనాలేంటి?
X

దిశ, ఫీచర్స్: మొదటగా బల్లపరుపు నేలపై రెండు కాళ్లు ముందుకు చాచి కూర్చోవాలి. తర్వాత ఎడమకాలి మోకాలిని మడిచి పాదాన్ని ఎడమ పిరుదు కిందపెట్టాలి. ఇప్పుడు కుడి పాదాన్ని తీసుకొచ్చి ఎడమ తొడపై కార్నర్‌లో ఉంచాలి. తర్వాత కుడి అరచేతిని కుడివైపు నేలపై పెట్టాలి. ఎడమచేతితో ఎడమపాదాన్ని నెమ్మదిగా పైకి లేపి నడుముభాగంలో అదిమి పట్టుకోవాలి. ఈ భంగిమలో వెన్నుముక, కుడిచేయి నిటారుగా ఉండేలా చూసుకోవాలి. ఇలా సాధ్యమైనంత సేపు ఆగిన తర్వాత కుడికాలిని మడిచి చేయాలి.

ప్రయోజనాలేంటి?

* పొత్తికడుపు, వెన్నెముకను బలపరుస్తుంది.

* కండరాలను ఉత్తేజపరుస్తుంది.

* సంతానోత్పత్తికి ప్రయోజనకరం.

* శరీరంలో శక్తిని పెంపొందిస్తుంది.

* డిప్రెషన్ నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

Advertisement

Next Story

Most Viewed