యువతలో తెల్లజుట్టు రావడానికి ప్రధాన కారణాలు ఇవే!

by Jakkula Samataha |
యువతలో తెల్లజుట్టు రావడానికి ప్రధాన కారణాలు ఇవే!
X

దిశ, ఫీచర్స్ : చాలా మంది యువతను బాధపెడుతున్న అతి పెద్ద సమస్య తెల్లజుట్టు. వృద్యాప్యంలో రావాల్సిన ఈ సమస్య ఇప్పుడు చిన్నపిల్లల్లో కూడా వస్తుంది. దీంతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఏదైనా ఫంక్షన్స్‌కు వెళ్లినా, పార్టీస్‌కు వెళ్లినా జుట్టు కవర్ చేసుకోవడమో లేక మార్కెట్లో దొరికే వివిధ ఉత్పత్తులను ఆశ్రయిస్తున్నారు. వీటితో రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి.

అయితే ప్రస్తుతం యువతలో జుట్టు నెరసిపోవడం ఎందుకు జరుగుతుంది. దీనికి గల కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎక్కువ ఒత్తిడి అనేది జుట్టుపై ప్రభావం చూపుతుందంట. నిద్రలేమి, ఆందోళన, ఆకలి మందగించడం వంటి సమస్యలు ఎక్కువ అవుతాయి. ఈ కారణంగా జుట్టు ఆరోగ్యం దెబ్బతింటుంది. అనేక సమస్యలు వస్తాయి. క్రమంగా నల్ల జుట్టు తెల్లగా మారుతుంది. అందుకే ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. అలాగే మార్కెట్‌లో రసాయనాలు అధికంగా ఉండే షాపూస్, ఆయిల్ లాంటివి వాడ కూడదంట. వీటి వలన కూడా జుట్టు నెరసిపోతుందంట. ముఖ్యంగా పురుషుల్లో, మద్యం సేవించడం, సిగిరేట్ లాంటివి తాగడం వలన జుట్టు నెరసి పోతుంది అంటున్నారు వైద్య నిపుణులు.

Advertisement

Next Story

Most Viewed